నవంబరు - 2014 నియామకాలు


నవంబరు - 3
¤ ఆర్థిక సేవల కార్యదర్శిగా జి.ఎస్. సంథు స్థానంలో హస్ముఖ్ అథియా నియమితులయ్యారు.
        » సంథూను రసాయన ఆయుధాల విభాగం ఛైర్మన్‌గా నియమించారు
.
        » మంత్రివర్గ నియామక సంఘం ఈ నియామకాలను ఆమోదించింది.
నవంబరు - 11 
¤ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ మహర్షి ఇక నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.        » ఆర్థిక కార్యదర్శిగా ఆయన నియామకాన్ని, నియామకాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (ఏసీసీ) ఆమోదించింది.        » అక్టోబరులోనే అరవింద్ మాయారం స్థానంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 
నవంబరు - 17
¤ తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ టి. మీనాకుమారి నియమితులయ్యారు.
        » ఈ పదవిలో ఆమె అయిదేళ్లపాటు కొనసాగుతారు
.
        » మీనా కుమారి మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే పదవి విరమణ చేశారు.
నవంబరు - 18 
¤ సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సుతీర్థ భట్టాచార్య కోల్ ఇండియా ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.        » కోల్ ఇండియా ఛైర్మన్‌గా ఉన్న నర్సింగరావు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
నవంబరు - 23
¤ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి దీపక్‌గుప్తా నియమితులయ్యారు.
        » ఇప్పటి వరకు యూపీఎస్సీ సభ్యుల నుంచే ఒకరిని ఛైర్మన్‌గా ఎంపిక చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి తొలిసారిగా బయటి వ్యక్తిని ఈ పదవికి ఎంపిక చేసింది.
నవంబరు - 25
¤ లోక్‌సభ కొత్త సెక్రటరీ జనరల్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ అనూప్ మిశ్రా నియమితులయ్యారు.
        » స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయన్ని నియమించారు.
        » పి.కె.గ్రోవర్ స్థానంలో డిసెంబరు 1న మిశ్రా బాధ్యతలు స్వీకరిస్తారు.
¤ భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) తదుపరి అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.కె.ప్రసాద్ నియమితులయ్యారు.
        » ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ ప్రసాద్‌ను ఎంపిక చేసంది.
        » భారత ప్రెస్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షుడు జస్టిస్ మార్కేండేయ కట్జూ స్థానంలో ప్రసాద్ నియమితులయ్యారు.
నవంబరు - 26
¤ ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్ల బాధ్యతలను చూసే 'ప్రత్యేక రక్షణ దళం' (ఎస్‌పీజీ-స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కొత్త డైరెక్టర్‌గా ఎస్.ఎస్.చతుర్వేదిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియమించింది.
        » ప్రస్తుతం ఈ పదవిలో 1981 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి దుర్గా ప్రసాద్ ఉన్నారు. ఆయన 2011 నవంబరులో ఎస్పీజీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.