భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు
బారత దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి--రాజేంద్ర ప్రసాద్
భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి--ప్రతిభా పాటిల్
బారత దేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి--సర్వేపల్లి రాధాకృష్ణన్
స్వతంత్ర అబ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మొట్టమొదటి రాష్ట్రపతి--వి.వి.గిరి
భారతదేశపు మొట్టమొదటి దళిత రాష్ట్రపతి--కే.ఆర్.నారాయణన్
భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతి--వి.వి.గిరి
రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళ--సుమిత్రా దేవి
పదవీ కాలంలో మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి--జాకీర్ హుస్సేన్
ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు
బారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
బారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి--ఇందిరా గాంధీ
బారత దేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి--సర్దార్ పటేల్
భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--ఇందిరా గాంధీ
లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--వి.పి.సింగ్
పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి--మురార్జీ దేశాయ్
పార్లమెంటు సబ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి--పి.వి. నరసింహారావు
పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ
బారత దేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి--పి.వి.నరసింహా రావు
కేంద్ర మంత్రులు
స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి--వల్లభ్ భాయి పటేల్
భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి--మౌలానా అబుల్ కలాం ఆజాద్
స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి--బి.ఆర్.అంబేద్కర్
స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి--అమృత్ కౌర్
స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి--జాన్ మథాయ్
స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి--ఎస్.పి.ముఖర్జీ
స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి--బల్‌దేవ్ సింగ్
పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి--గోపాల స్వామి అయ్యంగార్
ముఖ్యమంత్రులు
బారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--సుచేతా కృపాలానీ
రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు--ఎన్.డి.తివారి
దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి--దామోదరం సంజీవయ్య
దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి--మాయావతి
రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--జానకి రామచంద్రన్
ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడు--యం.జి.రామచంద్రన్
భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి--నంబూద్రిపాద్
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నీలం సంజీవరెడ్డి
తెలంగాణా మొట్టమొదటి ముఖ్యమంత్రి--కె.చంద్రశేఖరరావు
అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీనాథ్ బోర్డోలాయ్
బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--శ్రీకృష్ణ సిన్హా
బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి--రబ్రీదేవి
ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి--చౌదరీ బ్రహ్మప్రకాష్
గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--జీవ్‌రాజ్ నారాయణ్ మెహతా
హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి--పండిత్ భగవత్ దయాళ్ శర్మ
కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--రవిశంకర్ శుక్లా
మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--యశ్వంత్ రావ్ చౌహాన్
తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి--సి.ఎన్.అన్నాదురై
మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి--పి.ఎస్.కుమారస్వామి రాజా
జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి--షేక్ అబ్దుల్లా
ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--నారాయణ్ దత్ తివారీ
ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోవింద వల్లభ్ పంత్
పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--గోపీచంద్ భార్గవ
త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి--సచింద్ర లాల్ సిన్హా
పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి--ప్రపుల్ల చంద్ర ఘోష్
గవర్నర్లు
బారత దేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్--సరోజినీ నాయుడు
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
తెలంగాణ మొట్టమొదటి గవర్నర్--ఇ.ఎస్.ఎల్.నరసింహన్
ఝార్ఖండ్ మొట్టమొదటి గవర్నర్--ప్రభాత్ కుమార్
కర్ణాటక మొట్టమొదటి గవర్నర్--జయ చామరాజ వడయార్ బహదూర్
మధ్యప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--పట్టాభి సీతారామయ్య
పంజాబ్ మొట్టమొదటి గవర్నర్--సి.యం.త్రివేది
రాజస్థాన్ మొట్టమొదటి గవర్నర్--గురుముఖ్ నిహాల్ సింగ్
రాజస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్--ప్రతిభా పాటిల్
ఉత్తరా‌ఖండ్ మొట్టమొదటి గవర్నర్--సుర్జీత్ సింగ్ బర్నాలా
పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్--సి.రాజగోపాల చారి
ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్--హెచ్.పి.మోడి
న్యాయమూర్తులు
బారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి--హరిలాల్ జే కానియా
సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి--మీరాఁ సాహెబ్ ఫాతిమా బీవీ
బారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ--లీలాసేథ్
దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి--అన్నా చాందీ
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు
అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు--బి.ఎన్.రావు
రాజకీయ పార్టీలు
భాజపా తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి
భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు--ఉమేష్ చంద్ర బెనర్జీ
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళ--సరోజినీ నాయుడు
భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు--బద్రుద్దీన్ తయ్యబ్ జీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొట్టమొదటి అధ్యక్షుడు--యస్.వి.డాగే
జనసంఘ్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు--శ్యాం ప్రసాద్ ముఖర్జీ
భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు--అటల్ బిహారీ వాజపేయి
తెలుగు దేశం పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు--నందమూరి తారక రామారావు
లోక్‌సభ / అసెంబ్లీ స్పీకర్లు
లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్--జి.వి.మౌలాంకర్
ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్--కాశీనాథరావు వైద్య
లోక్‌సభ మొట్టమొదటి దళిత స్పీకర్--జి.యం.సి.బాలయోగి
ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ--షాన్నో దేవి
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిలా స్పీకర్--ప్రతిభా భారతి
అవార్డులు / బహుమతులు
భారత రత్న అవార్డులు
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు--సర్వేపల్లి రాధాకృష్ణన్రాజగోపాలా చారిసి.వి. రామన్
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--ఇందిరా గాంధీ
ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి--జవహార్ లాల్ నెహ్రూ
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరు--మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి--మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--లాల్ బహదూర్ శాస్త్రి
పద్మవిభూషణ్ అవార్డులు
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జే.ఆర్.డి.టాటా
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషణ్
పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్
నోబెల్ బహుమతులు
బారత దేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత--రవీంద్రనాథ్ టాగూర్
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--మదర్ థెరీసా
శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త--సి.వి.రామన్
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త--అమర్త్యా సేన్
వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు--హర్ గోవింద్ ఖురానా
అర్జున అవార్డులు
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ ‌బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--విశ్వనాథన్ ఆనంద్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--గీత్ సేథి
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి--కరణం మల్లేశ్వరి
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--లియాండర్ పేస్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--జ్యోతిర్మయి సిక్దర్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--ధన్‌రాజ్ పిళ్ళే
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ క్రీడాకారుడు--పుల్లెల గోపీచంద్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా
రామన్ మెగ్సేసే అవార్డులు
రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
సామాజిక సేవా రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి--యం.ఎస్.సుబ్బలక్ష్మి
మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్
భారత దేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్--రీటా పారియా
భారత దేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్--సుశ్మితా సేన్
మిస్ యూనివర్స్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ఇంద్రాణి రెహ్మాన్
మిస్ వరల్డ్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ప్లెయుర్ ఎజెకీల్ (Fleur Ezekiel)
మిస్ ఆసియా-పసిపిక్ గెల్చిన మొట్టమొదటి భారతీయురాలు--దియా మీర్జా
జ్ఝాన్ పీఠ్ అవార్డులు
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి రచయిత--శంకర్ కురూప్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి--ఆశాపూర్ణదేవి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి తెలుగు రచయిత--విశ్వనాథ సత్యనారాయణ
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి హిందీ రచయిత--సుమిత్రా నందన్ పంత్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఉర్దూ రచయిత--ఫిరాఖ్ గోరఖ్ పురి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మళయాళం రచయిత--శంకర్ కురూప్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి బెంగాలీ రచయిత--తారా శంకర్ బందోపాధ్యాయ
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కన్నడ రచయిత--కే.వి.పుట్టప్ప
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి గుజరాతి రచయిత--ఉమా శంకర్ జోషి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఒరియా రచయిత--గోపీ కాంత్ మహంతి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మరాఠి రచయిత--విష్ణు శంకర్ ఖందేల్కర్
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి పంజాబీ రచయిత--అమృతా ప్రీతం
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కాశ్మీరీ రచయిత--రెహమాన్ రాహి
జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి అస్సామీ రచయిత--బీరేంద్ర కుమార్ భట్టాచార్య
దాదా సాహెబ్ అవార్డులు
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్
ద్రోణాచార్య అవార్డులు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా
ఇతర అవార్డులు
బోర్లాగ్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అమృతా ప్రీతం
ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--భాను అథియ్య
మూర్తిదేవి అవార్డును పొందిన మొట్టమొదటి రచయిత్రి--ప్రతిభా రే
భట్నాగర్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ--అసిమా చటర్జీ
రష్యా దేశపు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--చండ్ర రాజేశ్వర రావు
పాకిస్తాన్ ప్రభుత్వపు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--మురార్జీ దేశాయ్
బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఖుదాదాద్ ఖాన్
పరమ వీర చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--మేజర్ సోమనాథ్ శర్మ
అశోక చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--నీరజా భానట్
సాంస్కృతిక అవగాహనలో యూథాంట్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎస్.స్వామినాథన్
టెంపుల్టన్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.రాధాకృష్ణన్
ఆంగ్ల భాష తరపున సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఆర్.కే.నారాయణ
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--ఇంద్రజిత్ గుప్తా
అధికార పదవులు
బారత దేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
బారత దేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
బారత దేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--వి. యస్. రమాదేవి
బారత దేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
బారత దేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
భారత దేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
బారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ--పునీతా అరోరా
భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడీ
ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్--నిఖిల్ చక్రవర్తి
బ్రిటన్ కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్
సాహస కృత్యాలు
ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
పాక్ జలసంధి ని ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహీర్ సేన్
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--బచేంద్రీపాల్
దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
అంటార్కిటికా వెళ్ళు బారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
ఉత్తర దృవం లో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
పనామా కాలువ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
క్రీడలు
క్రికెట్
టెస్ట్ క్రికెట్
టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్.[1]
టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే [2]
టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సుల్ గవాస్కర్
లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్
వన్డే క్రికెట్
వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
ట్వంటీ-20
ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్ కు మొట్టమొదటి భారత కెప్టన్--వీరేంద్ర సెహ్వాగ్
ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచ కప్ సాదించిన భారత సారధి --మహేంద్రసింగ్ ధోని
ఫస్ట్ క్లాస్ క్రికెట్
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
టెన్నిస్
వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి
చెస్
చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్
ఇతర క్రీడలు
ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్
ఆర్థికం
బ్రిటీష్ వారి దోపిడి సిద్దాంతాన్ని పేర్కొన్న మొట్టమొదటి భారతీయుడు--దాదాబాయి నౌరోజీ
ఆర్థిక సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు--కే.సి.నియోగి
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి--అమర్త్యాసేన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గవర్నర్ అయిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
సినిమా రంగం
దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ పాల్కే
దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ
దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బేగం పాతిమా సుల్తానా
మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గీస్ దత్
రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పాశెట్టి
చరిత్ర
భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
భారత్ - చైనా ల మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ--రజియా సుల్తానా
మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్
జాతీయోద్యమం
స్వరాజ్ పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు--దయానంద సరస్వతి
జాతీయ డిమాండు గా స్వరాజ్య ను ఉద్ఘాటించిన మొట్టమొదటి భారతీయుడు--బాల గంగాధర తిలక్
వ్యక్తిగత సత్యాగ్రహం చేసి అరెస్టు అయిన మొట్టమొదటి సత్యాగ్రహి--వినోభా భావే
భారత్ లో కార్మిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి నాయకుడు--ఎన్.ఎం.లొఖండే
ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు--లాలా లజపతి తాయ్
రాయల్ సొసైటీ లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--జగదీశ్ చంద్ర బోస్
బారత దేశపు మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్--సి. రాజగోపాలాచారి
బ్రిటీష్ పార్లమెంటు సబ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--దాదా భాయి నౌరోజీ
రాయల్ సొసైటీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--శ్రీనివాసన్ రామానుజమ్
మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్
వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్ర-పి-సిన్హా
బ్రిటీష్ ఇంపీరియల్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--పిరోజ్ షా మెహతా
శాస్త్ర, సాంకేతిక రంగాలు
సున్నాను ఒక సంఖ్యగా పరిగణించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త--బ్రహ్మగుప్తుడు
హృదయ మార్పిడి చేసిన మొట్టమొదటి భారతీయ వైద్యుడు--డా. వి.వేణుగోపాల్
ఇతరములు
అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు--రాకేష్ శర్మ
బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు--కే.సి. నియోగి
సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
లేబర్ కమీషన్ మొట్టమొదటి అధ్యక్షుడు--గజేంద్ర గడ్గర్
మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్