రాత్రిపూట ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం? భూమి తన అక్షం చుట్టూ ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





 సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రతతో ఉండే గ్రహం ఏది?
జవాబు: శని

 కిందివాటిలో 'గ్రేట్ బేర్‌'కు సంబంధించింది-
జవాబు: నక్షత్ర సముదాయం
 దినదైర్ఘ్యం, అక్షాంశాలు దాదాపుగా భూమిని పోలి ఉండే గ్రహం ఏది?
జవాబు: అంగారకుడు

 అత్యంత ఉష్ణ గ్రహం ఏది?
జవాబు: శుక్రుడు

 అత్యంత ప్రకామంతమైన గ్రహం ఏది?
జవాబు: శుక్రుడు

 భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది?
జవాబు: శుక్రుడు

 సౌర వ్యవస్థలో అత్యధిక పగటి కాలం ఉన్న గ్రహం ఏది?
జవాబు: శుక్రుడు

 రాత్రిపూట ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం?
జవాబు: అంగారకుడు

 గ్రహ కక్ష్యల నియమాలను ఎవరు ఆవిష్కరించారు?
జవాబు: జొహాన్నెస్ కెఫ్లర్

 కిందివాటిలో అంతర (Inner) గ్రహాల్లో అతిపెద్దది -
జవాబు: భూమి

 భూమికంటే గురుగ్రహం ఎన్ని రెట్లు పెద్దది?
జవాబు: 10

 భూమి తన అక్షంమీద ఒక్కసారి పరిభ్రమించడానికి పట్టే సమయం (కచ్చితంగా)-
జవాబు: 23 గంటల, 56 నిమిషాల, 4.09 సెకన్లు

 'కృష్ణబిలం' (blackhole) అనేది-
జవాబు: తీవ్రమైన గురుత్వాకర్షణతో ఉండే సంకుచిత నక్షత్రం

 సూర్యుడి చుట్టూ ఉండే గ్రహాల కక్ష్యలు లేదా భూమి చుట్టూ ఉన్న ఉపగ్రహాల కక్ష్యలు ఏ విధంగా ఉంటాయి?
జవాబు: వలయాకారం, దీర్ఘ వలయాకారం

 నాసా (NASA) డీప్ ఇంపాక్ట్ స్పేస్ మిషన్‌ను ఏ తోకచుక్కకు సంబంధించిన సమీప చిత్రాలను తీయడానికి ప్రయోగించింది?
జవాబు: టెంపెల్-1

 సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది?
జవాబు: గనిమెడ

 భూమి తన అక్షం చుట్టూ ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది?
జవాబు: పడమర నుంచి తూర్పునకు

 కక్ష్యా తలానికి భూఅక్షం వాలు-
జవాబు: 661/2º

 స్ప్రింగ్‌వేలా(tides)లు ఏ సమయంలో ఏర్పడతాయి?
జవాబు: చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే రేఖలో ఉన్నప్పుడు

 భూభ్రమణ వేగం ఎక్కడ అత్యధికంగా ఉంటుంది?
జవాబు: భూమధ్యరేఖ వెంబడి

 'మొహ్స్ స్కేలు'ను దేన్ని సూచించడానికి ఉపయోగిస్తారు?
జవాబు: ఖనిజాల కాఠిన్య స్థాయి

 భూమికి సంబంధించిన భూమధ్యరేఖ పరిధి దాదాపు?
జవాబు: 40,076 కి.మీ.

 భూమధ్య రేఖ దగ్గర ఉబ్బెత్తుగా, ధ్రువాల వద్ద చదునుగా ఉండటం వల్ల భూవ్యాసార్ధం దాదాపు ఎన్ని కి.మీ. మేరకు భూమధ్య రేఖ వ్యాసార్ధం కంటే తక్కువగా ఉంటుంది?
జవాబు: 22

 భూమి ఏ దిశను సూచిస్తూ తన అక్షం చుట్టూ తిరుగుతుంది?
జవాబు: ధ్రువనక్షత్రం

 కింద ఇచ్చిన నాలుగు నగరాల్లో ఏదైనా నిర్ణీత సందర్భంలో మిగిలిన మూడు నగరాలకు కలవని సమయం ఉన్న నగరం ఏది?
జవాబు: అడిస్ అబాబా (ఇథియోపియా)

 భూ పరిధిని (circumferrences) మొదటగా మాపకం చేసినవారు?
జవాబు: ఎరటోస్తనీస్

 సముద్రంలోని వేలాల్లో (tides) నిల్వ ఉన్న శక్తి-
జవాబు: 1) హైడ్రాలిక్ 2) గతిజ 3) గురుత్వాకర్షణ 4) పైన పేర్కొన్న మూడురకాల శక్తుల కలయిక

 భూమి మీద ప్రాణి పుట్టిన ప్రాచీన కాలంలో ఎలాంటి వాతావరణం ఉంది?
జవాబు: కార్బన్‌కు బద్ధమైన ఆక్సిజన్

 స్వీయాక్షం మీద భూమి వాలి ఉండకుంటే సంభవించేది ఏది?
జవాబు: రుతువులు మారేవి కావు

 ఒక స్థలం అక్షాంశం, ఆ స్థలానికి చెంది దేన్ని సూచిస్తుంది?
జవాబు: ఉష్ణోగ్రత



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment