కొబ్బరి కాయల గురించి మనకు తెలియని కొన్ని నిజాలు?




coconut కోసం చిత్ర ఫలితం


>> కొబ్బరిని ఆహారంలో ఒక పధార్ధముగానే తెలుసు. ఇవే కాకుండా కొబ్బరి "జీవితానికే ఒక పండు" గా చెప్పబడే వాటి గురించి కూడా తెలుసుకుందాము.

coconut water కోసం చిత్ర ఫలితం
>> కొబ్బరి వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని అందరికీ తెలుసు. వీటి గురించి ఎన్నో హెల్త్ మరియూ మెడికల్ పత్రికలలో రాశారు . కానీ కొబ్బరి నీళ్ళు నరాలలోకి ఎక్కిస్తే అది కొద్దిసేపటివరకు బ్లడ్ ప్లాస్మా గా పనిచేస్తుందని 1950 లో సోలమన్ ద్వీపంలో ఒక  "డి-హైడ్రేటడ్" పేషెంటుకు ఎక్కించినట్లు పత్రాలు ఉన్నాయి. 
coconut mask కోసం చిత్ర ఫలితం
>> మొదటి ప్రపంచ యుద్దంలో రసాయణ ఆయుధాలు ఎక్కువగా ఉపయోగించేవారు . అందువలన గ్యాస్ మాస్క్ ఖచ్చితంగా ఉపయోగించవలసివచ్చింది. ఎన్నో రకాల మాస్కులు తయారు చేసేవారు . కానీ అవి పూర్తిగా సైనికులను రక్షించలేకపోయేవి. అప్పుడు కొబ్బరి నారను, తగలబెట్టి అందులోనుండి వెలువడిన పొడిని చేర్చి తయారుచేసిన మాస్క్ అత్యంత రక్షణ ఇచ్చింది. 
>> కొబ్బరి కాయలనుకోయడానికి కోతులకు ట్రైనింగ్ ఇచ్చి, వాతి చేత పొడుగైన చెట్లలో కాచిన కొబ్బరికాయలను కోయించేవారట. 
coconut building కోసం చిత్ర ఫలితం
>> కొబ్బరి తినడానికి మాత్రమే కాకుండా కట్టడాలు కట్టడానికికూడా ఉపయోగపడుతుందని పిలిప్పిన్స్ ప్రెసిడెంట్  Fఎర్దినంద్ అర్చొస్ కొబ్బరిచెట్టు దూలాలతో రాజభవనం కట్టించాడు . ఈ కొబ్బరి భవనానికిగానూ 10 మిల్లియన్ డాలర్లను ఖర్చు చేశాడు . 
bio diesel కోసం చిత్ర ఫలితం
>> బయో డీజల్ వినే ఉంటారు. రాబోవు కాలంలో పెట్రోలుకు బదులు బయో డీజల్ ఉపయోగిస్తారు. కానీ కొబ్బరి నుండి తీయగలిగే ఒక రసాయణం పెట్రోల్ కు బదులు వాడుకోవచ్చునట. ఇదేమంత ఆశ్చర్యపడే విషయం కాదు. ఎందుకంటే పూర్వం వేరుసెనగ నూనెతో ఇంజిన్లు నడిపేవారు. 
>> పూర్వం యుద్దాలలో కొబ్బరి నారతో చేసిన హెల్మెట్లను వాడేవారు. కానీ పసిఫిక్ మహాసముద్రం లోని అతిచిన్న దీవి అయిన కిరిబటి కొబ్బరినారతో పూర్తి మిలటరీ సూటు చేయించుకున్నారట. 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment