టాంజానియా
»టాంజానియా అసలు పేరు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా. తూర్పు ఆఫ్రికా లోని ఒక సార్వభౌమ రాజ్యం. దీని ఉత్తరాన కెన్యా మరియు ఉగాండా, పశ్చిమాన రువాండా, బురుండీ మరియు కాంగో, దక్షిణాన జాంబియా, మలావి మరియు మొజాంబిక్, మరియు తూర్పున హిందూ మహాసముద్రం ఎల్లలుగా గలవు. |
»జర్మనీ రాజులు క్రీ.శ. 1880లో టాంజానియాను ఆక్రమించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 1964 వరకు బ్రిటిష్ వాళ్లే ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పటికి ఈ ప్రాంతం పేరు టాంగన్యికా. దీనికే జాంజిబార్ అనే పేరు కూడా ఉండేది. |
»ప్రపంచంలోనే అద్భుతమైన కొండలు ఈ దేశంలో ఉన్నాయి. వీటిని కిలిమంజారో కొండలు అంటారు. ప్రపంచంలోనే పొడవైన నది నైలు, దానితోపాటు జైరే నదులు ఈ దేశంలో పారుతున్నాయి. అలాగే అతిపెద్ద అగ్ని పర్వతం బద్దలైన పెద్దగొయ్యి కూడా ఈ దేశంలోనే ఉన్నాయి. విక్టోరియా సరస్సు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు. 12వ శతాబ్దంలో ఇక్కడ బానిసల వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. అరబ్బులు తమ పనులకోసం ఈ ప్రాంతం నుండే బానిసలను కొనుక్కొని వెళ్లేవారు. |
»పరిపాలనా పరంగా దేశాన్ని మొత్తం 30 రీజియన్లు గా విభజించారు. 25 రీజియన్లు దేశంలో ఉండగా మిగిలిన ఐదు హిందూమహాసముద్రంలో ఉన్న జాంజిబార్ దీవిలో ఉన్నాయి. ఈ రీజియన్లను 169 జిల్లాలుగా విభజించారు. దేశం మొత్తానికి రాష్ట్రపతి ఉంటాడు. అలాగే జాతీయ శాసనసభ కూడా ఉంటుంది. ప్రధానమంత్రి కూడా ఉంటాడు. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి- ఒకప్పటి రాజధాని నగరం దార్ ఎస్ సలామ్, ప్రస్తుత రాజధాని డొడొమా, ఇంకా ఆరుష, గీటా, బుకోబా, కిగోమా, మోషి, బబాటె, ముసోమా, ఎంబేయా, మొరోగోరో, మౌంట్‌వవారా, ఎంవాంజా, కిబాహ, సుంబవంగ, సోంగియా, షిన్యాంగా, బరియాది, సింగిడా, తబోరా, టాంగా, జాంజిబార్ సిటీ మొదలైనవి. |
»దేశజనాభాలో 95 శాతం ప్రజలు బాంటు మూలం కలిగిన వారే. అయితే దేశం మొత్తంలో 126 తెగల ప్రజలు ఉన్నారు. వీటిలో సుకుమ తెగ అత్యధిక జనాభా కలిగి ఉంది. వీరు ఉత్తరాన ఉన్న విక్టోరియా సరస్సు ప్రాంతంలో ఉంటారు. ప్రజల్లో అధికభాగం వ్యవసాయం చేస్తారు. హద్‌జాపి అనే తెగవాళ్ళు కేవలం వేటాడి జీవనం కొనసాగిస్తారు. మసాయి తెగవాళ్లు ఎక్కువగా జంతుపోషణ చేస్తారు. ఏ కుటుంబంలో జంతువులు అధికంగా ఉంటే ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. టాంజానియా ప్రజలు కొబ్బరిపాలు ఎక్కువగా తాగుతారు. వరి అన్నం, ఉగాలి, చపాతి తింటారు. |
»టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ పర్వతాన్ని సంవత్సరంలో ఏ రోజైనా ఎక్కవచ్చు. ఇక్కడ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. కిలిమంజారో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ పర్వతం ఒక మిలియన్ సంవత్సరాల క్రితం ఉప్పొంగిన అగ్నిపర్వతం కారణంగా ఏర్పడింది. |
»ఎన్ గొరొంగోరో గొయ్యి ప్రపంచంలోనే పెద్ద గొయ్యి, ఇది దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు ఇతర జంతువులను వేటాడడం మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఇక్కడే దాదాపు ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయి. |
»టాంజానియా దేశంలో మొత్తం 16 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్‌గోరోంగోరో కన్సర్వేషన్ ప్రాంతం, గోంబే స్ట్రీమ్ జాతీయపార్కులు ఉన్నాయి. |
టాంజానియా అసలు పేరు : యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా |
టాంజానియా రాజధాని: డొడొమా, |
టాంజానియా వైశాల్యం: 9,47,303 చదరపు కిలోమీటర్లు |
టాంజానియా జనాభా: 4,75,000,000 |
టాంజానియా ప్రభుత్వం: యూనిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్ |
టాంజానియా భాషలు: స్వాహిలీ, ఇంగ్లిష్, కరెన్సీ: టాంజానియా షిల్లింగ్, మతాలు: క్రైస్తవులు 40%, ముస్లిములు 23%, హిందువులు 2%, ట్రైబల్ తెగలు 23% |
టాంజానియా స్వాతంత్య్రం: 1961, డిసెంబర్ 9 |
టాంజానియా జీడీపీ : $48.921 బిలియన్లు |
టాంజానియా కరెన్సీ : Tanzanian shilling (TZS) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment