ఈ రహస్యాలను చేదించే దమ్ము మీకుందా ? అంతు పట్టని రహస్యాలు !




జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి. ఖచ్చితంగా జరుగుతోంది. అదెలా ? చూడండి. వర్ష రుతువులు వచ్చాయంటే చాలు ఈ పక్షులు రాత్రులలో పొగ మంచు వేళలలో ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెట్ల పై కూర్చుని వున్నా పక్షులు అత్యధిక వెలుగు ప్రసరించే లైట్ ల వేలుగులలోకి ఎగిరి అంతు చిక్కని రీతిలో కిందపడి మరణిస్తాయి. స్థానికులు వీటిని ఆపటానికి ప్రయత్నించారు. కాని ఫలితం సున్నా ! ఏమిటీ విచిత్రం ?
                                                      Image result for jatinga

యాగంటి ప్రదేశం, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో కలదు. ఇక్కడ కల నంది విగ్రహం ఒకటి నేటికీ పెరుగుతూ వుంటుంది. (అయితే, ఇటువంటి విగ్రహమే, బెంగుళూరు లో కూడా కలదు. కాని ఇది పెరగటం బలవంతంగా ఆగింది).ఈ నంది విగ్రహం జీవం పోసుకున్న రోజున జీవం పోసుకుని పరుగెత్తటం మొదలు పెట్టిన రోజున ప్రళయం సంభవిస్తుందని, కాలం ఆగి పోతుందని చెపుతారు. మరి దాని పరుగు కంటే ముందే మనం పరుగు పెట్టి ప్రళయం నుండి తప్పించుకుంటే మంచిదేమో.
                                         Image result for yaganti

ఈ వేలాడే స్థంభం క్రి. శ. 16 వ శతాబ్దం నాటి శిల్పం ఇది అని చెపుతారు. ఈ వేలాడే స్థంభం ఆనాటి శిల్పకారుల నైపుణ్యం అయితే, నేడు 21 వ శతాబ్దంలో అది ఒక మిస్టరీ అయ్యింది. ఈ వేలాడే స్థంభం, ఆంధ్ర ప్రదేశ్ లోని లేపాక్షి లో కల వీర భాద్రేస్వరుడి టెంపుల్ లో వుంది. ఇది రూఫ్ నుండి వేలాడుతుంది. భూమిపై అతక కుండ వుంటుంది. ఇంత పెద్ద స్థంభం వేలాడటం ఎలా సాధ్యం ? ఏమిటీ వింత ?
                                                Image result for లేపాక్షి లో కల వీర భాద్రేస్వరుడి

పేరు చెపితేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాని ఇది నిజం. ఈ సరస్సు ఉత్తరాఖండ్ లోని రూప కుండ్ ప్రదేశంలో కలదు. ఈ మానవ ఆస్థి పంజరాలు సైంటిఫిక్ గానే కాక పురాణ పరంగా కూడా వివరణ కలిగి వున్నాయి. ఈ సరస్సు, సముద్ర మట్టానికి అధిక ఎత్తులో కలదు. కయినా సరే, ధైర్యం కలవారు దాని వద్దకు వెళతారు. కొంతమంది ఈ సరస్సు క్రి.శ 850 లేదా క్రి.శ900 నాటిదని చెపుతారు. అయితే, ఇక్కడ అస్థిపంజరాలు ఎలా వచ్చాయనే మిస్టరీ నేటికీ అంతు పట్టనిదిగా వుంటుంది.
                                         Image result for roopkund

ద్యూమాస్ బీచ్ అరేబియా సముద్రానిది. ఇది గుజరాత్ తీరంలో ఒక ప్రసిద్ధ బీచ్. ఇక్కడ కొంతమంది వారి రాత్రి శికారులలో మిస్ అయ్యారని, లేదా గాలిలోకి కలసిపోయారని చెపుతారు. ఈ బీచ్ లో మానవాతీత చర్యలు అనేకం జరుగుతాయని కూడా స్థానికుల కధనంగా వుంటుంది. మరి ఎంతో కాలంగా ఈ ప్రదేశంలో వినపడుతున్న ఈ నిజాన్ని లేదా అభూత కల్పనను ఎవరు చేదించ గలరు.
                                            Image result for ద్యూమాస్ బీచ్

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment