'ఈ-మెయిల్' ఎలా మొదలైంది?

'ee-meyil' ela modalaindi?
కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు.. వాటికి విస్తృతార్థాలతోపాటు పాత పదాల అంతరార్థాలనూ శోధించి ప్రపంచానికి వెల్లడించే ఆక్స్ ఫర్డ్ ఇండగ్లీష్ డిక్షనరీ (ఓఈడీ) ఇప్పుడు మరో పద పరిశోధనకు సన్నద్ధమైంది. అసలు ఎలా మొదలైందో తెలియకుండానే అందరి జీవితాల్లో భాగమైన ఆ పదం మరేమిటోకాదు.. ఈ- మెయిల్. 

ఎలక్ట్రానిక్ మెయిల్ ప్రక్రియకు ఈ- మెయిల్ షార్ట్ ఫామ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫామ్ ని మొట్టమొదట ప్రయోగించింది, ఉపయోగించింది లేదా కనిపెట్టింది ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్నే ఆక్స్ ఫర్డ్ శోధించనుంది. 1975లోనే ఎలక్ట్రానిక్ మెయిల్ అనే పదాన్ని గుర్తించినప్పటికీ దానికి షార్ట్ ఫామ్ గా భావించే ఈ- మెయిల్ మాత్రం 1979లో గానీ వెలుగులోకి రాలేదని చెబుతూనే.. 1979లో విడుదలైన కొటేషన్లు అంతకు ముందే మనుగడలో ఉన్న పదాలను వెలుగులోకి తెచ్చిందని 'యూఎస్ఏ టుడే' పేర్కొంది. 

అలా చూస్తే 'ఈ- మెయిల్' అనే పదం 1979 కన్నా ముందే ఉండి ఉండాలి. ఈ గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈ-మెయిల్ పుట్టుపూర్వత్రాలను తవ్వితీసే ప్రయత్నం చేస్తోంది ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment