కాకతీయుల కాలంనాటి చారిత్రాత్మక శివాలయం (దక్షిణ కాశీ)

Shambhu lingeswara temple history special story kakatiya kingdom yadava kings


దాదాపు 1000 సంవత్సరాల క్రితంనాటికి సంబంధించిన ఈ శివాలయం.. ఓ మారుమూల ప్రాంతంలో వున్న నేపథ్యంలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చారిత్రాత్మక సమాచారాలు అంతగా వెలుగులోకి రాలేదు కానీ.. దీని నిర్మాణశైలి కాకతీయుల కాలంనాటిదేనని అక్కడి లభించిన కొన్ని శాసనాల ద్వారా చారిత్రాత్మక నిపుణులు వెల్లడించారు. ఈ ఆలయంలో కొన్ని నమ్మశక్యంకానీ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటో తెలుసుకుందాం...

ఆలయ విశేషాలు :
ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలోని మేళ్లచెరువులో వుంది. జాతీయ రహదారి నుంచి కేవలం 10 కి.మీ. దూరంలో వుంటుంది. ఇక్కడ లభించిన శిలాశాసనాల ప్రకారం ఇది 11వ శతాబ్దంలో యాదవరాజులు నిర్మించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే.. 1.83 మీ. ఎత్తు, 0.34 మీ. చుట్టుకొలత కలిగి వున్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం పెరుగుతూ వుంటుంది. ఈ శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే.. ప్రతి అడుగు తర్వాత ఒక వలయం ఏర్పడటం మరో ఆశ్చర్యం. 

ఈ విధంగా ఇది పెరుగుతూ.. మొదటి మూడు నామాలు పెట్టే స్థలం నుంచి ఇప్పుడు ఆరునామాలు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు చెబుతుంటారు.

ఇంకొక విచిత్రం ఏమిటంటే.. ఈ శివలింగం పై భాగంలో ఓ చిన్న ఖాళీ ప్రదేశముంది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ నీరు ఊరుతూనే వుంటుంది. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఉబుకుతుంది. అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా ఈ నీళ్లు ఉబుకుతూ వుంటుంది. 

ఈ నీటిని ఎంత తీసివేసినా.. తిరిగి మళ్లీ ఊరుతూనే వుంటుంది. దేశంలో కేవలం వారణాసిలో మాత్రమే వుండేది. ఇప్పుడు ఈ శివాలయం కూడా అలాగే వుండటంతో దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు.

చరిత్ర :
కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. దానిని గమనించిన ఓ యాదవ కాపరి.. ఆ రాయి శివలింగం అని తెలియక దాన్ని 11 ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పారేశాడట. అయితే రెండో రోజు చూస్తే అది తిరిగి మళ్లీ అక్కడ లింగంగా ప్రత్యక్షమై కనిపించిందట. ఈ మొత్తం వ్యవహారం ఆ కాపరికి అర్థం కాక రాజుగారికి వెళ్లి వినిపించాడు. దాంతో ఆయన ఆ రాయిని పరిశీలించిన అనంతరం దాన్ని శివలింగంగా గుర్తించి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment