పష్మీనా శాలువా... :
దీన్నే టిబెటన్ భాషలో కష్మీరీ అని పిలుస్తారు. పషమ్ అంటే లోపలిభాగం అని అర్థం. దీన్నించి వచ్చినదే పష్మీనా. అంటే 12 నుంచి 14 వేల అడుగుల ఎత్తున ఉన్న హిమాలయ సానువుల్లో మాత్ర మే పెరిగే కాప్రా హిర్కస్ మేకల పొట్ట భాగంనుంచి తీసినదాన్నే కష్మీరీ లేదా పష్మీనా ఊలు అంటారు.
ఈ మేకల ఊలులో అధికంగా ఉండే ప్రోటీన్ల కార ణంగా అది మంచి మెరపుతో మృదువుగా ఉంటుంది.ప్రపంచంలోకెల్లా ఉత్తమమైనదిగా పేరొందిన ఈ ఊలు, కేవలం కాశ్మీర్, టిబెట్‌లలో మాత్రమే లభ్యమవుతుంది. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే యూరోపి యన్లకు ఈ పష్మీనా శాలువల ఘనత తెలిసింది.
ఎందుకంటే హిమాలయాల్లో సంచరించే ఈ మేకల నుంచి తీసిన ఊలు పోగులు వాటిల్లోని అధిక ప్రోటీన్ల కారణంగా చలిని తట్టుకోగలవు. మనిషి వెంట్రుక మందం 75 మైక్రాన్లు ఉంటే, వీటి మందం 12-14 మైక్రాన్లకి మించదు. అయినప్పటికీ వెచ్చదనం మాత్రం చాలా ఎక్కువ.
దాంతో పష్మీ నా ఊలుతో పైస్లీలోన శాలువాలు తయారుచేయడం ప్రారంభించారు. కానీ, అవి కాశ్మీరీ మహిళల పనితనానికి సాటిరావు. ఎంత గొప్ప మెషీన్ల మీద చేసి నవయినా ఒక్కో పోగునూ వేరుచేసి అల్లే వారి నైపుణ్యం ముందు తీసికట్టే.
అందుకే ఇప్పటికీ విదేశీయులకి భారతీయ పష్మీనా శాలువాలమీదే తగని మక్కువ.అది షాల్, రాప్, స్టోల్ లేదా స్కార్ఫ్ ఏదయినాగానీ కాశ్మీరీదయితే చాలు, అక్కడ హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. అదీ పష్మీనా ఊలుతో అల్లినదయితే ఇక చెప్పే పనే లేదు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment