నోబెల్ గ్రహీతలు ( ఇండియా )
రవీంద్రనాథ్ ఠాగూర్
ఆసియా ఖండంలోనే తొలిసారిగా రవీంద్రనాథ్ ఠా గూర్ సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని
1913లో అందుకున్నారు. దీంతో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడిగా నిలాచారు
. బెంగాలీ భాషలో రాసిన గీతాంజలి కావ్యానికి ఈ పురస్కారం లభించింది. మన జాతీయ గీతమైన
జనగణమనను, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రవీద్రుడు రచించారు.
1913లో అందుకున్నారు. దీంతో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడిగా నిలాచారు
. బెంగాలీ భాషలో రాసిన గీతాంజలి కావ్యానికి ఈ పురస్కారం లభించింది. మన జాతీయ గీతమైన
జనగణమనను, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రవీద్రుడు రచించారు.
మదర్ థెరిస్సా
మానవ సేవ కన్న మిన్న ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహిళామణి మదర్ థెరిస్సా.
1979 లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఉస్కబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం
(ప్రస్తుతం స్కోప్జీ, మాసిడోనియా)లో 1910, ఆగస్టు 26న మదర్ థెరిస్సా జన్మించారు. 1929,
జనవరి 6న కోల్‌కత్తాకు చేరుకున్న ఆమె ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులను అక్కు న
చేర్చుకొని అనాథ శరణాలయాలను స్థాపించింది. మదర్ థెరిస్సా అందించిన సేవలకుగాను
1962లో పద్మశ్రీ, 1972లో జవహర్ లాల్ నెహ్రూ, 1980లో భారత రత్న అందుకున్నారు.
సీవీ రామన్
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట్రామన్‌కు 1930లో నోబెల్
పురస్కారం లభించింది. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టినందుకు గాను ఆయ న ఈ బహుమతి
అందుకున్నారు.
రామన్ ఎఫెక్ట్: సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా
పరిక్షేపం చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది. ఇలా
ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన పలితాన్నే
రామన్ ఎఫెక్ట్ అంటారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ని సీవీ రామన్ కనుగొన్నారు.
దీంతో ప్రతీ ఏడాది ఫిబ్రవరి 28ని జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)గా జరుపుకుంటున్నారు.
1954లో సర్ సీవీ రామన్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రభుత్వం ప్రకటించింది.
అమర్త్యసేన్
1998లో ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. కరువు, మానవాభివృద్ధి
సిద్ధాంతం, సంక్షేమ అర్థశాస్త్రం, పేదరికానికి గల కారణాలను అమర్త్యసేన్ విశ్లేషించారు.
పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోడంతో ప్రజల
వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించారు.
1999లో భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న అవార్డుని ప్రకటించింది.
కైలాస్ సత్యార్ధి
బాల కార్మికుల విముక్తి కోసం పోరాడుతున్న కైలాస్ సత్యార్ధి పాకిస్థాన్ బాలిక మలాలా
యుసఫ్ జాయ్‌తో కలిసి 2014లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. 1954, జనవరి
11న మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆయన జన్మించారు. 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే
సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలకు పైగా పిల్లల హక్కుల కోసం కృషి చేస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది చిన్నారులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి
కల్పిండంతోపాటు అక్రమ రవాణా నుంచి ఎంతో మంది చిన్నారులను విడిపించి విద్యాలయాల్లో
చేర్పించారు.
మహాత్మునికి దక్కని నోబెల్
శాంతికి, అహింసకు ప్రతిరూపమైన మహాత్మా గాంధీ కి నోబెల్ బహుమతి ఇప్పటి వరకు
రాలేదు. నోబెల్ కమిటీ శాంతి విభాగంలో మహాత్ముడి పేరును 1937, 1938, 1939,
1947, 1948లో ప్రతిపాందించింది. 1947 లో పాకిస్థాన్ ఏర్పాటు విషయంలో వివాదాలు
చోటు చేసుకోవడంతో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయించింది.
1948లో శాంతి బహుమతి కోసం గాంధీజీని ఎంపికచేసినప్పటికీ అదే ఏడాది ఆయన
మరణించారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మరణించిన వ్యక్తులకు నోబెల్ బహుమతులు
ప్రకటించాలనే నిబంధన అప్పుడు ఉన్నది. గాంధీజీ ఒక సంస్థకు ప్రతినిధి కాకపోవడం,
మరణ విల్లును రాయకపోవడంతో నోబెల్ బహుమతిని ఎవరికి అందజేయా లో తెలియకపోవడంతో
ఆయనకు ఆ బహుమతి ప్రకటించలేదు.