Grammar 1


  Grammer 1   

  Grammar అంటే తెలుసు కదావాక్యనిర్మాణంమాటల వాడకం లాంటి వాటికిసంబంధించింది
English లో తప్పులు లేకుండా మాట్లాడాలన్నారాయాలన్నాgrammar తెలుసుకోవడం అవసరం. 
అయితే grammar తెలిసినంత మాత్రాన, grammar నిబంధనలన్నీ అంత బాగా గుర్తుండకపోవచ్చుఅందుకే మన భాషతప్పులు లేకుండా 
ఉంటుందనుకోవడానికి వీల్లేదుGrammar తెలుసుకోవడంతోపాటు రాయడం, మాట్లాడటం regular గా practice చేయడం చాలా ముఖ్యం. మాట్లాడటంరాయడంచదవడం లాంటివి సాధనచేయకపోతే ఫలితం ఉండదు.         ఈ grammar అందివ్వడంలో ముఖ్యోద్దేశాలు రెండు. మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమైందీ, మీరు correct గా మాట్లాడగలిగేందుకు, రాయగలిగేందుకు సహాయపడటం. రెండోది - ఇప్పుడు అన్ని తరగతుల, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు grammar కే ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీ సొంతం చేసుకునేందుకు చేయూతను అందించడం.
        ఈ grammar lessons చదివి, అర్థం చేసుకుని practice
 చేస్తే 
మీరు చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు. తప్పులు లేకుండా రాయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. 
1. Sentence: A group of words with
 complete meaning.

1) New Delhi is the capital of India

     
(ఇండియా రాజధాని ఢిల్లీ
)
     
ఇది పూర్తి అర్థాన్నిచ్చే మాటలసమూహంకాబట్టి 

ఇది sentence.
2) What are you doing?

     
(నువ్వేం చేస్తున్నావు
?)
     ఇది కూడా పూర్తి అర్థాన్నిచ్చే group of words కాబట్టిఇది sentenceఅవుతుంది.
3) Read the lesson (
పాఠం చదువు
), and
4) How tall he is! (
అతనెంత పొడుగ్గా ఉన్నాడో!) కూడా sentences. 

      ప్రతి sentence ఏదో ఒక దాన్ని గురించి చెబుతుంటుంది కదాఅది sentence కు 

subject అవుతుందిFor example, sentence (1), New Delhi ని గురించి 
చెబుతోందికాబట్టి New Delhisentence (1) కు subject.అలాగే sentence (2) 
కు subject, 'you', sentence (4) కి 'he' subjectఅవుతాయి.
      sentence (3), Read the lesson = 

You read the 
lesson.. ఇక్కడ -you subject అవుతుందిఅయితే ఇలాంటి sentences లో you 
మామూలుగావాడంమనం ఇంత వరకు తెలుసుకున్నది:
       Sentence 
దేన్ని గురించి చెబుతోందోఅది దాని subject అవుతుంది.ఇదెప్పుడూ 

గుర్తుంచుకోవాల్సిన విషయం. Sentences లో కూడా రకాలు ఉంటాయి.
1. ఏదైనా ఒక విషయాన్ని తెలిపేది.
e.g.: 
a) He comes here in the evenings.
              (అతడు ఇక్కడికి సాయంత్రం పూట వస్తాడు.)
b) I Know English.
    (నాకు ఇంగ్లిష్ తెలుసు.)
    ఇలాంటి sentences, statements ను assertive sentences అని కూడా అంటారు.
(state = చెప్పడం)
2. రెండోరకం sentences, ప్రశ్నలు (questions).
a) Where is he?
    
(అతడెక్కడ? )
b) What is your name?
  ఇలాంటి questions ను interrogative sentences అని 

కూడా అంటారు.
    ( Interrogate = ప్రశ్నించడం). 

3.
 ఇక మూడోరకం sentences, imperative sentencesఅంటే ఇవి ఆజ్ఞలను,అభ్యర్థనలను

 (order & requests) తెలుపుతాయి.
    (you) sit down     {(నువ్వుకూర్చో}.
    (you) Please come in
    (లోపలికి రండి - అభ్యర్థన).
     ఈ imperative sentences అన్నింటికి subject మామూలుగా 'you'ఒక్కోసారి అంటాం

మామూలుగా వదిలేస్తాం ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి
¤  ¤  ¤  ¤  ¤  ¤
ఒక స్కూల్లో ఉన్న విద్యార్థులంతా ఏదో ఒకclass వాళ్లై ఉంటారు కదా?
 అలాగే English లో ప్రతిమాటా ఏదో ఒక part of speech(భాషా భాగం)గా ఉంటుంది.
English లో eight parts of speechఉన్నాయి.
అవి
1. Noun
2. Pronoun
3. Adjective
 

4. Verb
5. Adverb
6. Conjunction
7. Preposition
8. Interjection
.
 
NOUNS:
Noun means a name.

మనుషులుజంతువులుప్రదేశాలువస్తువులు ఇలా దేనికైనా మనం ఇచ్చేపేర్లను'Nouns' అంటారు.

       పై nouns అన్నీ ఒక్కొక్క పేరుతోనే ఏర్పడేవిఅంటే ఇవి Simple nouns.కొన్నిసార్లురెండు మూడు మాటల కలయికతో కూడా nouns ఏర్పడతాయి.
అవి Compound nouns
e.g: Shoe + lace = shoelace
         foot + ball = football

     ఇవేకాకుండా nouns లో మూడో తెగ derivative nouns. కొన్ని సందర్భాల్లోఒక noun కు ఇంకో శబ్దం చేర్చడం వల్ల ఏర్పడేదే derivative noun.

IMPORTANT: Nouns లో రెండు రకాలుంటాయి.
1) Countables: ఇన్ని,అన్ని అని సంఖ్యలోచెప్పేవాటిని
 countablesఅంటాం
అంటే వీటిని మనం1, 2, 3 అని లెక్కించవచ్చు
 
e.g.: One pen, two pens, five pens అంటాం కదా - కాబట్టి pen, countable... 
అలాగే మరికొన్ని countables: Book, tablestudent, teacher, man, woman,
 child etc ఇవన్నీ countables.
2) Uncountables - మనంలెక్కపెట్టలేనివి.
     e.g.: Sugar, milk, 

rice etc. వీటిని మనం సంఖ్యల్లోచెప్పంఅంటే లెక్కించం
 -కాబట్టి ఇవి uncountables.
Some more examples of uncountables: air, oil, coffee, tea etc.
 
uncountables Plural ఉండదు. Milk, sugar, rice లాంటివి Plural లో 
(2 milks, 3 sugars అని) చెప్పకూడదు.
3. Countable singulars కు ముందు కచ్చితంగా a/an వాడాల్సిందే.
      A book gives information (Book countable singular కాబట్టి, 

దాని ముందు 'A' వాడాం.) అలాగే An Umbrella is useful in rain (
ఇక్కడ umbrella, countable singular. కాబట్టి దానిముందు an వాడాం).
(A/an = ఒక.)
      పైన చెప్పుకున్న వాక్యానికి తెలుగు అర్థం - గొడుగు వర్షంలో ఉపయోగపడుతుంది.
      అంతేకానీ ఒక గొడుగు వర్షంలో ఉపయోగపడుతుందని 
అనం.
      కానీ English లో ఇది చాలా ముఖ్యం - countable singular ముందు a/an వాడటం అనేది.
      అయితే ఎప్పుడు 'a' వాడాలి? ఎక్కడ 'an' వాడాలి
?
      తెలుగు శబ్దాలు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ తో ప్రారంభమయ్యే English 

మాటల ముందు An వాడతాం.
      మిగతా వాటిముందు, '
A' ను ఉపయోగిస్తాం.
      చూడండి: An ant, An aunt, An egg, An idea, An ox (ఎద్దు), An owl (గుడ్లగూబ), 

An Umbrella, An honour (ఆన(ర్) = సన్మానం/పురస్కారం), An hour (అవ(ర్)).
      University కి ముందు ఏం వాడతాం. A University అనే అంటాం; 

university = యూనివ(ర్)సిటీ- అ నుంచి ఔ వరకు ఉండే శబ్దాల్లో, యూ లేదు కదా? 
అందుకని A University అనడం correct. అందుకే ఈ అంశాలు గుర్తుంచుకుందాం.
4. Uncountables: వీటికి plural ఉండదు. milks, sugars, rices అనం కదా? 

ఈ కిందివి గుర్తుంచుకోండి. 
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు: 
 noun అయినా Uncountable అయితే - 1) దానికిplural ఉండదు.
 2) 
దాని ముందు a/an రాదు
.
      
అయితే అన్ని భాషల్లో లానే English లో కూడా రెండుఅర్థాలుండే 

మాటలు చాలా ఉన్నాయి.
 అలాంటప్పుడు ఒకేnoun, ఒక అర్థంతో countable కావచ్చు
ఇంకో అర్థంతోuncountable కావచ్చు
 


     ఒక మాట ఎప్పుడు countable, ఎప్పుడు uncountable అనే విషయంలో కాస్త జాగ్రత్తగాఉండాలి.

I bought iron yesterday.

      ఇక్కడ iron ముందు 'an' లేదుకాబట్టి అర్థంనేను నిన్న ఇనుము కొన్నానుఅని.

I bought an iron yesterday.
      Iron ముందు, an ఉంది కదాఅంటే ఇక్కడ iron countable. కాబట్టి అర్థం,ఇస్త్రీపెట్టె.







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment