¤ చిత్రం సినిమాతో కథానాయకుడిగా అడుగుపెట్టి, హ్యాట్రిక్ హీరోగా పేరొందిన ఉదయ్‌కిరణ్ (34) హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
» మూడు తమిళ చిత్రాలతో సహా మొత్తం 19 చిత్రాల్లో ఉదయ్‌కిరణ్ నటించారు. |
|
» 'నువ్వు నేను' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. |
జనవరి - 11
|
¤ ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎరియల్ షరాన్ (85 సంవత్సరాలు) జెరూసలేంలోని హెబా మెడికల్ సెంటర్‌లో మరణించారు. |
|
» 2001లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైన షరాన్ 2006, జనవరి 4న తీవ్రమైన గుండెపోటుతో అచేతన స్థితిలోకి వెళ్లేవరకు ఆ పదవిలో కొనసాగారు.
» వివాదాస్పద సైనిక పాలకుడైన షరాన్ తన నిరంకుశ విధానాలతో 'ది బుల్డోజర్' గా గుర్తింపు పొందారు. దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన అన్ని యుద్ధాల్లోనూ భాగస్వామి అయిన షరాన్‌ను ఇజ్రాయెలీలు 'మిస్టర్ సెక్యూరిటీ' గా పిలుచుకుంటారు.
» భారత్‌ను సందర్శించిన తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా షరాన్ రికార్డు సృష్టించారు. 2003లో ఆయన భారత్‌కు వచ్చారు. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కృషి చేశారు. |
| ¤ వెండితెర సీతగా పేరొందిన అలనాటి నటీమణి అంజలీదేవి (86) చెన్నైలో మరణించారు.
» ఆమె తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్టు 24న జన్మించారు.
» 1947లో వచ్చిన 'గొల్లభామ' ఆమె తొలి చిత్రం. ఎన్టీఆర్ రాముడిగా 1963లో వచ్చిన 'లవకుశ' చిత్రంలో సీతగా అద్వితీయ నటన కనబరచి 'వెండితెర సీత'గా పేరొందారు. |
» తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగులో దాదాపు 350 సినిమాల్లో నటించారు. భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో కలిసి అంజలీ పిక్చర్స్ సంస్థను స్థాపించి, 27 సినిమాలను నిర్మించారు.
» తెలుగులో అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు చిత్రసీమకు అందించిన విశిష్ఠ సేవలకు 2005లో అంజలికి రాష్ట్ర ప్రభుత్వం 'రఘుపతి వెంకయ్య' పురస్కారాన్ని ప్రదానం చేసింది. నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2008లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఆమె గెలుచుకుంది. |
జనవరి - 15
|
¤ ప్రముఖ కవి, దళిత పాంథర్ పార్టీ వ్యవస్థాపకుడు పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్ ముంబయిలో మరణించారు. ఆయన వయసు 64 ఏళ్లు.
» పుణే జిల్లాలోని మారుమూల పల్లెలో 1949 ఫిబ్రవరి 15న ఢసాల్ జన్మించారు. |
|
¤ ఒకప్పుడు అందాలనటిగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుచిత్రాసేన్ (82) కోల్‌కతాలో మరణించారు. |
» బెంగాలీ నటి అయిన సుచిత్రాసేన్ ప్రముఖ నటి మూన్‌మూన్‌సేన్‌కు తల్లి. ఆమె మనవరాళ్లయిన రియాసేన్, రైమాసేన్ కూడా కథానాయికలే.
» సుచిత్రాసేన్ బెంగాలీ, హిందీ భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఆమె అసలుపేరు రోమాదాస్ గుప్తా. 1931లోని పబ్న జిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పుట్టారు. |
|
» 'శేష్ కొదాయ్' అనే బెంగాలీ చిత్రంలో ఆమె తొలిసారిగా నటించారు. 'సాత్పాకే బందా' చిత్రంలో నటనకు 1963లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయచలన
చిత్రోత్సవంలో ఉత్తమనటి అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయచలన చిత్రోత్సవ వేదికపై పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమెగుర్తింపు
పొందారు.
» హిందీలో 'దేవదాస్' (1955), 'ముసాఫిర్' (1957), 'బొంబాయ్‌కా బాబూ'
(1960), 'ఆంధీ' (1975)లో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు.
» 'ఆంధీ'లో ఆమె ఓ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించారు. అదిఅప్పటి ప్రధాని ఇందిరాగాంధీని పోలిన పాత్ర.
» 2005లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌పాల్కేపురస్కారాన్ని
ప్రకటించింది. అయితే, ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించడానికినిరాకరించారు. |
| ¤ వెండితెరపై తన నట విశ్వరూపంతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన 'నటసామ్రాట్', దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు (91 సంవత్సరాలు) హైదరాబాద్‌లో మరణించారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. |
» అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకటరాఘవాపురంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబరు 20న జన్మించారు.
» నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పారు. నాటకాల్లో ఆడవేషాలు వేసి మెప్పించారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.
» 17 ఏళ్ల వయసులోనే 'ధర్మపత్ని' చిత్రంతో తెరంగేట్రం చేశారు.
» కీలుగుర్రం, బాలరాజు చిత్రాలతో జానపద కథానాయకుడిగా, మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
» విప్రనారాయణ, అర్ధాంగి, బాటసారి, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు, దసరాబుల్లోడు, ప్రేమనగర్, చాణక్య చంద్రగుప్త, మేఘసందేశం, సీతారామయ్యగారి మనవరాలు తదితర చిత్రాల్లో ఆయన నటన శిఖరాగ్రానికి చేరింది.
» ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 'దేవదాసు' (1953). 2011 పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. |
» ఎనభై నాలుగేళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు ఆయన సినీలోకంలో విహరించారు.
» మొత్తం 256 చిత్రాల్లో నటించారు. అందులో ఒక హిందీ, 26 తమిళ చిత్రాలు ఉన్నాయి. 'ఒకే ఒక్కడు' అనే టీవీ ధారావాహికలో కూడా ఆయన నటించారు. అక్కినేని నటించిన చివరి చిత్రం 'మనం'. |
¤ టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్‌స్లిమ్ బ్యాంకాక్‌లో దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 51 సంవత్సరాలు.
» బ్యాంకాక్‌లోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లోని 22వ అంతస్థు నుంచి పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. |
|
» బ్రిటన్‌కు చెందిన కార్ల్‌స్లిమ్ 2012 లో టాటామోటర్స్ పగ్గాలు చేపట్టారు. భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా స్లిమ్ 2007 నుంచి సభ్యుడిగా ఉన్నారు. |
|
|