జనవరి - 2014 పర్యటనలు



జనవరి - 2
¤ ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా సతీసమేతంగా భారత పర్యటనకు వచ్చారు.

          

» న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో అబ్దుల్లా యమీన్ విడివిడిగా సమావేశమయ్యారు.


          
» రక్షణ, భద్రత, ఆర్థిక సహకార రంగాలపై ప్రధాని మన్మోహన్, యమీన్‌లు చర్చించారు.

          

» మాలే అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా కన్సార్టియంతో ఉన్న అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు యమీన్‌కు
 భారత ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బిడ్డింగ్ విధానంలో అవినీతికి పాల్పడిన ఆరోపణల కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలను ఆ దేశ ప్రభుత్వం తిరిగి అధీనం చేసుకుంది. ఆ ప్రాజెక్టులో ఇప్పటికే 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు జీఎంఆర్ గతంలో పేర్కొంది. నవంబరు 2012లో జీఎంఆర్ నుంచి రానున్న 500 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐని కూడా మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది.

          » భారత పర్యటనకు యమీన్ తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా న్యూఢిల్లీలో భారత్-మాల్దీవుల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు.

జనవరి - 16
¤ దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెయున్ హై భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.

         

» వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం సహా అనేక రంగాల్లో సహకారాన్ని మరింతగా వృద్ధి చేసుకోవాలని భారత్, దక్షిణ కొరియా నిర్ణయించాయి.


         
»
 సైబర్ స్పేస్ సహా వివిధ రంగాలకు సంబంధించి 9 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకోవడంపై కూడా ఇరువురు నేతలూ చర్చించారు.