క్రిస్టియన్ హైగెన్స్



క్రిస్టియన్ హైగెన్స్ 1629 ఏప్రిల్ 14న నెదర్లాండ్స్ హేగ్ పట్టణంలో జన్మించారు. సుజాన్నా, కానిస్టింటన్ హైగెన్స్ ఆయన తల్లిదండ్రులు. లేడెన్ విశ్వవిద్యాలయం, బ్రెడాలోని కాలేజ్ ఆఫ్ ఆరెంజ్‌లో గణితం, న్యాయశాస్త్రాలు అభ్యసించారు. 
 

జీవితం..
¤ 1663లో లండన్ నగరంలోని రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.1666లో
 ప్యారిస్‌కు చేరుకున్నారు. అక్కడ హైగెన్స్ ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా ఎంపికయ్యారు.

¤ 1655లో శనిగ్రహం చుట్టూ ఘన వలయం ఉందని ప్రకటించారు.


¤  శనిగ్రహం ఉపగ్రహం టైటాన్‌ను గుర్తించారు. లోలక గడియారాలు రూపొందించి 

1657లో పేటెంట్ కూడా సాధించారు.        

¤  లోలక డోలన కాలసూత్రం 
ని ఉత్పాదించారు. 1678లో కాంతి తరంగ రూపంలో ఈథర్ అనే యానకంలో ప్రయాణిస్తుందని ప్రకటించారు.

 'హైగెన్స్- ఫ్రెస్నెల్' నియమం ప్రతిపాదించారు. హైగెన్స్ రాసిన "ట్రీటైజ్ ఆఫ్ లైట్" (1690), 
''హోరోలోజియం" (1658) శాస్త్రగ్రంథాలు ఆయనకు గొప్ప ప్రఖ్యాతి ఆర్జించిపెట్టాయి. 
మొదటి పుస్తకంలో కాంతికి సంబంధించిన అంశాలు వివరిస్తే.. రెండో పుస్తకంలో లోలక 
గడియారాల తయారీకి సంబంధించిన విషయాలున్నాయి.
అవార్డులు:
       
హైగెన్స్ గౌరవార్థం ఎన్నో సంస్థలకు ఆయన పేరు పెట్టారు. ఎంతోమంది 

చిత్రకారులు హైగెన్స్ చిత్రం గీశారు. 1950లో డచ్ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం
 ఓ కరెన్సీనోట్ కూడా ముద్రించింది. అందులో ఆయనతోబాటు శనిగ్రహం చిత్రం 
కూడా ఉంటుంది. 1695 జులై 8న నెదర్లాండ్స్‌లో చనిపోయారు.