1) గుండెలోని కర్ణికలలో ఏది పెద్దది?
జ: కుడి కర్ణిక
2) గుండెలోని జఠరికలలో ఏది పెద్దది?
జ: ఎడమ జఠరిక.
3) క్షీరోత్పత్తిలో తోడ్పడే హార్మోన్ ఏది?
జ: ప్రోలాక్టిన్.
4) రక్త పీడనాన్ని నియంత్రించే వినాళ గ్రంథి ఏది?
జ: అడ్రినల్.
5) ఎముకలను ఆరోగ్యంగా ఉంచుటలో తోడ్పడే విటమిన్ ఏది?
జ: డి విటమిన్.
6) చిన్న పిల్లలలో ఏ విటమిన్ లోపం వలన ‘రికెట్స్’ వ్యాధి వ్యాపిస్తుంది?
జ: డి విటమిన్.
7) అతి చిన్న క్షీరదము ఏది?
జ: చుంచెలుక.
8) హార్మోనులను విడుదల చేసే అవయవ వ్యవస్థ ఏది?
జ: అంతస్స్రావీ వ్యవస్థ.
9) పృష్ట వంశము లేని జంతువులను ఏమంటారు?
జ: అకశేరుకాలు.
10) పృష్ట వంశముగల జంతువులను ఏమంటారు?
జ: సక శేరుకాలు.
11) స్పంజిక ఏ వర్గానికి చెందినది?
జ: పొరిఫెరా.
12) ఐ.ఎ.ఎ. అనగా?
జ: ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము.
13) హిమోగ్లోబిన్‌లో ఉండే మూలకం ఏది?
జ: ఐరన్.
14) రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని ఏమంటారు?
జ: థ్రాంబోసిస్.
15) గుండె వేగాన్ని పెంచే హార్మోన్ ఏది?
జ: అడ్రినల్.
16) తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణ స్థాయికంటే తగ్గిపోవడాన్ని ఏమంటారు?
జ: ల్యూకోపినియా.
17) లాంగర్ హన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయి?
జ: క్లోమం.
18) పురుషులలో వంధత్వం రాకుండా చేసే విటమిన్ ఏది?
జ: విటమిన్-ఇ.
19) కాంతి కిరణాలలో ఉండే శక్తిని ఏమంటారు?
జ: ఫోటాన్లు.
20) శుక్ర కణానికి ఉండే ఎక్రోసోం ఏ చర్యలో తోడ్పడుతుంది?
జ: ఫలదీకరణము.
21) ఆకులు, ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ ఏది?
జ: అబ్‌సైసిక్ ఆమ్లము.
22) మూడవ నెల గర్భధారణ పిండాన్ని ఏమంటారు?
జ: భ్రూణము.
23) ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి ఎంత?
జ: 4 కిలో కేలరీలు.
24) ఎ.డి.పి. అనగా?
జ: ఎడినోసిన్ డై ఫాస్పేట్.
25) ఎ.టి.పి. అనగా?
జ: ఎడినోసిన్ ట్రై ఫాస్పేట్.
26) ఎ.బి.ఎ. అనగా?
జ: అబ్ సైసిక్ ఆమ్లము.
27) మొక్కలలో ఆక్సిన్ తయారయ్యే స్థలం ఏది?
జ: విభాజ్య కణాలు.
28) ద్విధా విచ్చిత్తి వలన కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి పేరమీషియం
జరిపే చర్య ఏది?
జ: సంయుగ్మము.
29) కాంతి మీద ఆధారపడే జీవ రసాయన చర్య ఏది?
జ: కిరణజన్య సంయోగ క్రియ.
30) పరిసరాలలో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపు లక్షణాన్ని ఏమంటారు?
జ: క్షోభ్యత.
31) ప్రథమ చికిత్సకు ఆద్యుడైన జర్మన్ దేశస్థుడు?
జ: ఇస్ మార్క్.
32) వానపాములో శరీర కుహర ద్రవం వేటి ద్వారా బయటకు వస్తుంది?
జ: పృష్ట రంధ్రాలు.
33) రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం ఎంత?
జ: 0.85-0.9
34) కార్బోహైడ్రేట్స్‌లో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ ఏది?
జ: శ్వాసక్రియ.
35) పురుషులలో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది ఏది?
జ: ఉదర వితానం.
36) పూతికాహారులు పోషకాలను వేటి నుండి గ్రహిస్తాయి?
జ: జీవుల మృతకళేబరాల నుండి.
37) జీవులు తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారు
చేసుకోవడాన్ని ఏమంటారు?
జ: స్వయంపోషణ.
38) పరాన్న జీవికి ఆహారాన్ని అందించే జీవిని ఏమంటారు?
జ: అతిధేయ జీవి.
39) కేవలం మొక్కలను ఆహారంగా గ్రహించే జీవులను ఏమంటారు?
జ: శాఖాహారులు.
40) జంతువులను, ఇతర జీవులను భుజించే జంతువులను ఏమంటారు?
జ: మాంసాహారులు.
41) మొక్కలను, జంతువులను రెండింటినీ భుజించే జంతువులను
ఏమంటారు?
జ: ఉభయాహారులు.
42) మాంసాహార మొక్కలు ఏవి?
జ: సెపెంథిస్, డ్రాసిరా.
43) అతిధేయ శరీరంపైన బాహ్యంగా నివసించే పరాన్న జీవిని ఏమంటారు?
జ: బాహ్య పరాన్నజీవి.
44) మొక్కలలో ఏర్పడిన కార్బన్‌డై ఆక్సైడ్ వేటి ద్వారా విసర్జింపబడుతుంది?
జ: పత్ర రంధ్రాలు.
45) పొగాకు మొక్కలలో గల ఆల్కలాయిడ్ ఏది?
జ: నికోటిన్.
46) వేరు బొడిపెలలో ఉండే బాక్టీరియం ఏది?
జ: రైజోబియం.
47) వేప గింజలు, ఆకులు, బెరడులలో గల ఆల్కలాయిడ్ ఏది?
జ: నింబిన్.
48) కెఫిన్ అనే ఆల్కలాయిడ్ దేనిలో ఉంటుంది?
జ: కాపీ మొక్క గింజలలో.
49) ఎన్.ఎ.ఎ. అనగా?
జ: నాప్తలీన్ ఎసిటిక్ ఆమ్లము.
50) శ్వాస వర్ణకము అని దేనిని అంటారు?
జ: హిమోగ్లోబిన్.
51) నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో రెండవ గదిని ఏమంటారు?
జ: జాలకము.
52) పెరుగు తయారీలో ఉపయోగపడే బాక్టీరియా ఏది?
జ: లాక్టోబాసిల్లస్.
53) ప్రతి జనకాలు ‘ఎ’ మరియు, ప్రతి జనకాలు ‘బి’ లేని మనిషి రక్తం ఏ వర్గానికి చెందినది?
జ: ‘ఓ’ వర్గానికి.
54) కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్‌గా మారే చర్యను గుర్తించినదెవరు?
జ: కాల్విన్.
55) ప్లాస్మాలో ప్రతి రక్షకాలు లేని రక్తం ఏ గ్రూప్?
జ: ‘ఎబి’ గ్రూప్.
ఇవి కూడా చదవండి :
*ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు
*ఐక్యరాజ్యసమితి - ప్రశ్నలు
*కరెంట్ అఫైర్స్
*జనరల్ నాలెడ్జ్
*Computer Education