రెడ్‌ క్రాస్‌ ఎప్పుడు పుట్టింది?




   అది 1859 జూన్‌ మాసం. సొల్ఫెరినో యుద్ధం సమాప్తమవుతున్న సమయం. 
యుద్ధ భూమిలో వేలాదిమంది క్షతగాత్రులు సరైన వైద్య సదుపాయం అందక, విలవిల లాడుతున్నారు... అదే సమయంలో ఆ ప్రాంతం పక్క నుంచి ప్రయాణిస్తున్న 
హెన్రీ డ్యూనాంట్‌ అనే స్విస్‌ జాతీయుడు ఈ దృశ్యం చూసి చలించిపోయాడు. 

అక్కడికి సమీపంలోనే ఉన్న ఒక ఇటాలియన్‌ గ్రామం నుంచి కొందరు మహిళలను 
కూడగట్టుకుని క్షతగాత్రులకు వైద్య సాయమందించాడు. 

అంతటితో ఆగకుండా తాను చూసిన హృదయ విదారక దృశ్యాల్ని వర్ణిస్తూ ఒక 
కరపత్రాన్ని ప్రచురించాడు. యుద్ధరంగంలో క్షతగాత్రులకు జాతి వివక్ష లేకుండా తక్షణ 
వైద్య సదుపాయమందించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేస్తే యుద్ధ సమయంలో 
ఎన్నో మరణాలను నివారించవచ్చని సూచించాడు. 
డ్యూనాంట్‌ చేసిన ప్రతిపాదనను పద్నాలుగు దేశాలు జెనీవాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో రెడ్‌క్రాస్‌ తీర్మా నం ఆమోదించాయి. 1864లో ఆమోదించిన దానిని తిరిగి 
1906లో సవరించారు. యుద్ధ సమయాలలో వివిధ దేశాలలో ఏర్పాటైన సంస్థల పరిరక్షణనూ 
ఇందులో ప్రతిపాదిం చారు. రెడ్‌క్రాస్‌ ఎంబ్లమ్‌గా స్విస్‌ జెండాకు కొద్దిగా రంగులు మార్చి, ఎన్నుకున్నారు. 

నేడు రెడ్‌క్రాస్‌ పేరిట అనేకమంది సంయుక్తంగా ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు 
కానీ, యుద్ధం జరిగిన సమ యంలో కానీ తమ సేవలను అందిస్తున్నారు. యుద్ధ సమయంలో
 ఈ సంస్థను మిత్ర, శత్రు భేదం లేకుండా గౌరవిస్తుంటారు. బ్రిటీష్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీని 1870లో 
ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌సేనలకు వైద్య సదుపాయం ఉన్నప్పటికీ యుద్ధ సమయంలో 
రెడ్‌క్రాస్‌ అదనపు సాయాన్ని అందిస్తుంటుంది.


ఇంకా చదవండి: 
కంప్యూటర్‌ వైరస్‌ అంటే ఏమిటి?
ఎడారులు గురించి తెలుసుకుందాం ?
పీఠభూముల గురించి తెలుసుకుందాం ?
జలసంధులు గురించి తెలుసా ?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?