రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ కాలంలో కలకత్తాలో పోర్ట్ విలియమ్ కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. |
-సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులున్నారు. |
-సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తి సర్ ఎలిజా యంఫే 1861 కౌన్సెల్ చట్టం ద్వారా మొదట కలకత్తా, తర్వాత మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. |
-1886లో అలహాబాద్‌లో హైకోర్టు నెలకొల్పారు. |
-1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. |
-భారతదేశానికి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనవరి 28, 1950లో సుప్రీంకోర్టును ఢిల్లీలో ఏర్పాటు చేశారు. |
సుప్రీంకోర్టు ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉన్నారు. |
-సుప్రీంకోర్టు ప్రథమ న్యాయమూర్తి ఎచ్‌జే కానియా(హరిలాల్ జెకిసుండా కానియా) |
-సుప్రీంకోర్టు
న్యాయమూర్తులను 1956లో 11కు, 1960లో 145కు, 1977లో 18కు, 1986లో 26కు, 2008లో 31కి పెంచుతూ చట్టం చేశారు. |
-సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను పెంచే అధికారం పార్లమెంట్ కు కలదు. |
-ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు(హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు) |
-భారత
రాజ్యాంగంలో 5వ భాగంలో ప్రకరణ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణం, అధికార విధులను గురించి పేర్కొన్నారు. |
-124(2)
ప్రకరణం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను
రాష్ట్రపతి నియమిస్తాడు |
-సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ పదవుల్లో కొనసాగడానికి ఇష్టం లేనప్పుడు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. |
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి సాధారణంగా ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. |
సుప్రీంకోర్టు సీజే- అర్హతలు |
-124(3) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి కింది అర్హతలు ఉండాలి |
ఎ. భారతీయ పౌరుడై ఉండాలి. |
బి. ఏదైనా కోర్టులో న్యాయమూర్తిగా 5 ఏళ్ల అనుభవం ఉండాలి లేదా |
ఏదైనా హైకోర్టులో 10 ఏళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. |
సి. 65 ఏళ్లు నిండి ఉండరాదు. |
డి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయశాస్త్రంలో నిష్ణాతుడై ఉండాలి |
న్యాయమూర్తుల వేతనాలు(రూపాయల్లో) |
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - 1,00,000 |
సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి - 90,000 |
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - 90,000 |
హైకోర్టు సాధారణ న్యాయమూర్తి - 80,000 |
న్యాయమూర్తులకు వేతనంతో పాటు ఉచిత నివాసం. ఇతర |
సౌకర్యాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది. |
-న్యాయమూర్తులకు వేతనాలను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తారు. వీరి వేతనాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. |
-అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సందర్భాల్లో వీరి వేతనాలను తగ్గించడానికి వీలులేదు. |
-న్యాయమూర్తుల జీత భత్యాలను గురించి రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. |
-ప్రకరణం 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు లేదా అనివార్య కారణాలవల్ల తన విధులను నిర్వర్తించలేని పక్షంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు |
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు |
-సుప్రీంకోర్టు జడ్జీలను అసమర్ధత, దుష్ప్రవర్తన కారణాలతో రాష్ట్రపతి పదవి నుంచి వారిని తొలగిస్తాడు. |
-న్యాయమూర్తులను తొలగించడానికి లోక్‌సభ అయితే తొలగించే తీర్మానం నోట్‌పై 100 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్‌కు లేదా రాజ్యసభ చైర్మన్‌కు నోటీస్ ఇవ్వాలి. |
సుప్రీంకోర్టు అధికారాలు |
ప్రారంభ అధికారాలు: రాజ్యాంగంలోని 131 ప్రకరణ సుప్రీంకోర్టు ఒరిజినల్ లేదా ప్రారంభ అధికారాలను తెలుపుతుంది. అంటే సుప్రీంకోర్టు పరిధిలో మాత్రమే విచారించే కేసులు కేంద్రం రాష్ర్టాలు, వివిధ రాష్ర్టాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు విచారించి తీర్పులిస్తుంది. వీటిని ప్రారంభ అధికారాలంటారు. |
పునర్విచారణ అధికారం : మనదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావడంతో హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లను పరిశీలిస్తుంది. ఇవి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధమైనవి కావచ్చు. |
సలహా అధికార పరిధి : రాష్ట్రపతి సుప్రీంకోర్టును 143(1) ప్రకారం సలహాలు అడగొచ్చు. తన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. ఇంతవరకు రాష్ట్రపతి 14 అంశాలకు సంబంధించిన వివాదాల్లో సుప్రీంకోర్టు సలహాలను కోరారు. మొదటిసారిగా 1951లో ఢిల్లీ న్యాయచట్టాలకు సంబంధించినది. చివరగా 2006లో లాభదాయక పదవులను గురించి రాష్ట్రపతి సలహాను కోరారు. |
కోర్ట్ ఆఫ్ రికార్డ్ |
సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తాను ఇచ్చిన తీర్పులను భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఒకసారి కోర్టు రికార్డుల్లోకి వెళ్లిన అంశాన్ని చట్టంతో సమానంగా భావిస్తారు. |
ప్రాథమిక హక్కుల పరిరక్షణ : 32 అధికరణం కింద సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భంలో ఐదు రకాల రిట్లను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్ కోవారంటో, సెర్షియోరరీ |
ప్రధాన న్యాయమూర్తులు- ప్రత్యేతలు |
-సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తి హెచ్‌జే కానియా(హరిలాల్ జెకిసుండా కానియా) |
-సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు (హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు) |
-సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం పని చేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్(7 ఏళ్ల 140 రోజులు) |
-సుప్రీంకోర్టులో తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కే నాగేంద్రసింగ్ (17 రోజులు) |
-దేశంలో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ |
-3వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎంసీ మహాజన్ జమ్ము కశ్మీర్ ప్రధానమంత్రిగా అక్టోబర్ 15, 1947 నుంచి మార్చి 5, 1948 వరకు పనిచేశారు. |
-ఎక్కువమంది
ప్రధాన న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ఏపీజే
అబ్దుల్‌కలాం.(కేజీ బాలకృష్ణన్, ఆర్‌సీ లహోటీ, వీఎన్ ఖారే, వైకే సభర్వాల్, జీబీ
పట్నాయక్, ఎస్ రాజేంద్రబాబు) ఇంకా చదవండి : భారత రాజ్యాంగం - చట్టాలు హైకోర్టులు రాజ్యాంగం - రాష్ట్రాలు - అధికారాలు పంచాయతీరాజ్ వ్యవస్థ కమిటీలు - సిఫార్సులు |