యూట్యుబ్ ఎవరు ఎలా ఎందుకు కనుగొన్నారో తెలుసా ?



కొత్త వీడియో యాప్‌ మిక్స్‌బిట్‌ను ఇటీవల ఆవిష్కరించిన యూ-ట్యూబ్‌ సంస్థాపకులు 
చాద్‌ హర్లీ, స్టీవ్‌ చెన్‌లు వెబ్‌సైట్‌ నిర్వహణలో కొత్త పుంతలు తొక్కు తున్నారనడంలో 
సందేహం లేదు. 

వారు తాజాగా ఆవిష్కరించిన ఈ యాప్‌ యూజర్లు వీడియోను తీశాక దానిని స్లైస్  చేసి, 
కొత్త రీతిలో వాటిని కలపడానికి వీలు కల్పిస్తుంది. ఇతర మిక్స్‌బిట్‌ యూజర్ల వీడియోల 
నుంచి భాగాలను తమ దానిలో కలపి సరికొత్తది  తయారుచేయడానికి కూడా అది వీలుగా 
ఉండడం విశేషం. దీన్ని సృష్టించిన జంటకు పాక్షికంగా గూగుల్‌ నిధులు కల్పిం చింది.

 ఈ ప్రాజెక్ట్ట్‌ పూర్త య్యాక ఈ యాప్‌ను వర్తిం పజేసి, 256 క్లిప్‌లను గంట చలన చిత్రానికి 
కూర్చ గలదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క క్లిప్‌ 16 సెకండ్లు ఉంటోంది. అందు వల్ల 
మిక్స్‌బిట్‌ అత్యంత పోటీనిచ్చే దిశగా మార్కెట్‌లో కదులుతుందని చెప్పవచ్చు. 


       ఈయాప్‌ సృష్టికర్తలైన హర్లీ, చెన్‌తో కలసి యూట్యుబ్‌ను స్థాపించిన వారిలో మూడో 
వ్యక్తి - జావేద్‌ కరీమ్‌. వారు పేపాల్‌ తొలి నాళ్లలో దాని ఉద్యోగులు. తమకు ఇష్టమైన 
వీడియోను ఇతరులతో పంచుకోలేని పరిస్థితిని తొలగించాలన్న పట్టుదలే వారిని అందుకు ప్రేరేపించింది. 

తరచూ వినపడే కథ ఏమిటంటే. ఒకసారి హర్లీ, చెన్‌ తాము పాల్గొన్న డిన్నర్‌ పార్టీ 
వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితికి ఎంతో విచారించారు. అలా విచారిస్తూ
 కూర్చో కుండా సమస్య పరిష్కార ఆలోచనలో నుంచి పుట్టినదే వీడియో షేరింగ్‌ 
వెబ్‌ సైటైన 'యూ ట్యూబ్‌'. చెన్‌ ఇంటిలో జరిగిన ఆ పార్టీకి కరీమ్‌ హాజరు కాలేదు. 

అలాంటి పార్టీ జరగనే లేదనీ, అదంతా మీడియా ఓవరాక్షన్‌ అనీ కరీమ్‌ వాదిస్తాడు. కానీ 
ప్రచార సాధనాలు ఆ కథనానికే కట్టుబడుతున్నాయి. మొత్తానికి ఆ కథ తమ మార్కెటింగ్‌
 ప్రచార భావాల విజయానికి కలిసొచ్చిందని చెన్‌ అంటాడు. 

యూ ట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ముగ్గురు సహచర మిత్రులైన యువకులు ప్రారంభించిన 
తరువాత 2006లో గూగుల్‌ సొంతం చేసుకొంది. ఇప్పుడు యూట్యూబ్‌ గూగుల్‌ సంస్థలో 
భాగం. అది టీవీ ఛానల్‌ మార్కెట్‌కు ఎంతగానో అందివచ్చింది. యూట్యూబ్‌ నిర్వాహకులలో మూడోవ్యక్తి కరీమ్‌కు దీనిని ప్రారంభించడం వెనుక వేరే కథ ఉంది. 

2004నాటి జెనెత్‌ జాక్సన్‌ సూపర్‌బౌల్‌ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఆన్‌లైన్‌లో లేకపోవడాన్ని కరీమ్‌ ఫీల్‌ అయ్యాడు. అపుడే అతనికి వీడియో షేరింగ్‌ సైట్‌ ను తెరవాలన్న
 ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నాలలో ఉన్న హర్లీ, చెన్‌లతో చేతులు కలిపాడు. ఆన్‌లైన్‌ 
వీడియో వెర్షన్‌ నుంచి కూడా స్ఫూర్తి  పొందామని హర్లీ, చెన్‌ తెలిపారు. వెంచర్‌ ఫండెడ్‌
 టెక్నాలజీ స్టార్టప్‌ కింద ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 

                              

యూట్యూబ్‌కు 2005 నవంబర్‌ 2006 ఏప్రిల్‌ మధ్య ఓ మదుపు సంస్థ 11.5 మిలియన్‌ డాలర్ల 
పెట్టుబడి సాయం చేసింది. వెబ్‌ సైట్‌ను నెలకొల్పాక తొలి వీడియోకు 'మీ అండ్‌ ది జూ' 
అని పేరు పెటా ్టరు. సహ వ్యవప్థాపకుడు కరీమ్‌ శాండీగో జూలో ఉండగా ఈ వీడియో 
తీశారు. 2005 ఏప్రిల్‌ 23న అప్‌లోడ్‌ చేశారు. 

యూట్యూబ్‌ డొమైన ్‌నేమ్‌ను 2005 ఫిబ్రవరి 14న యాక్టివేట్‌ చేశారు. తిరుగు లేని 
విజయాలు రోజుకు 65 వేల కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నట్లు 2006లో 
అధికారికంగా ప్రారంభించిన కొంత కాలానికి యూ ట్యూబ్‌ కంపెనీ ప్రకటించింది. 

ప్రతి క్షణం 60 గంటల కొత్త వీడియోలు తమ సైట్‌కు అప్‌లోడ్‌ అవుతున్నాయని యూట్యూబ్‌ చెబుతోంది.మూడువంతుల వీడియోలు బయటి నుంచి వస్తున్నట్లు కూడా కంపెనీ 
తెలిపింది. యూట్యూబ్‌ను 2007 నాటికి నెలకు 80 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. 


ఇంటర్నెట్‌ మొత్తానికి 2000 సంవత్సరంలో ఖర్చయిన బ్యాండ్‌ విడ్త్‌ను 2007లో ఒక్క 
యూట్యూబ్‌ ఖర్చు చేసింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ తరువాత అత్యధికంగా యూజర్లు విజిట్‌ 
చేస్తున్నది యూ ట్యూబే!

అమెరికాలో వీడియోలను అందించే సైట్లలో యూట్యూబ్‌ వాటాయే అధికం.
ఇదే పేరుతో కానీ స్పెల్లింగ్‌ తేడాతో ఉన్న మరో వెబ్‌సైట్‌కు యూట్యూబ్‌ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని సొంతదారు యూట్యూబ్‌పై దావా వేశారు. ప్రజల విజిట్లతో ఓవర్‌ 
లోడవడంతో ఆయన ఈ చర్య తీసుకొన్నారు. కానీ తన డొమైన్‌ పేరును మార్చుకొన్నారు. 

యూట్యూబ్‌ 2008 జూన్‌ ఆదాయాన్ని 20 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది. సొంతదారు
 గూగుల్‌ యూట్యూబ్‌ ఆదాయాన్ని బహిరంగంగా వెల్లడించడం లేదు. 

యూట్యూబ్‌ కొంతమేరకు కంటెంట్‌ను 2010లో ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది. 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ 60 మ్యాచ్‌లు కూడా అలాగే యూట్యూబ్‌ ద్వారా వచ్చాయి. ప్రపంచంలోనే ఇది తొలిసారి ఉచితంగా ఆన్‌లైన్‌లో ప్రసారమైన పెద్ద క్రీడాసంబంధమైన 
ప్రసారం.