నల్లగొండజిల్లా శంభులింగేశ్వర స్వామి దేవాలయం కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం |
ఇక్కడి స్వయంభూ శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలో మేళ్ళచెరువులో ఉంది. 11వ శతాబ్ధంలో యాదవరాజులు దేవాలయాన్ని నిర్మించారు |
కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడి శివలింగం 1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది... నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది.. |
శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం ఏర్పడుతూ ఉంటుంది. |
మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. పెద్దవారు చెపుతుంటారు. |
ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ ఉబుకుతుంది... అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా... అందుకే ఇది స్వయంఅభిషేక లింగంగా చెప్పుకోవచ్చు... ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది |
ఇది ఒక అద్భుతం... శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు |
కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట... ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగంఅని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట... కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట... అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు... |
ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు |
Home / Unlabelled / ఇక్కడి ఆలయం లో ప్రతి సంవత్సరం శివలింగం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. . పెద్దవారు చెపుతుంటారు?- ఆ ఆలయం విశేషాలు ( శివరాత్రి ప్రత్యేకం )
ఇక్కడి ఆలయం లో ప్రతి సంవత్సరం శివలింగం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. . పెద్దవారు చెపుతుంటారు?- ఆ ఆలయం విశేషాలు ( శివరాత్రి ప్రత్యేకం )
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment