1. అల్యూమినియం ప్రధానంగా ఏ ఖనిజం నుంచి లభిస్తుంది?
1) బాక్సైట్
2) హెమటైట్
3) మాగ్నసైట్
4) సిడరైట్
2. ఎర్రబాక్సైట్‌లో ఏది మలినంగా ఉంటుంది?
1) ఐరన్ ఆక్సైడ్
2) సిలికా
3) కాపర్ ఆక్సైడ్
4) ఏదీకాదు
3. పంచలోహంలో ఉండని లోహం ఏది?
1) బంగారం
2) వెండి
3) కాపర్
4) టంగ్‌స్టన్
4. భూమి పొరల్లో అంత్యంత విస్తారంగా లభించే లోహం ఏది?
1) అల్యూమినియం
2) ఐరన్
3) కాపర్
4) సిల్వర్
5. ఏదైనా లోహం తుప్పుపట్టినపుడు దాని బరువు?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) మారదు
4) లోహ స్వభావంపై ఆధారపడి ఉంటుంది
6. ఐరన్ తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం?
1) ఐరన్ కార్బైడ్
2) ఐరన్ సల్ఫైడ్
3) ఐరన్ ఆక్సైడ్
4) ఐరన్ క్లోరైడ్
7. బైరైటీస్ ఖనిజం ఏ లోహానికి సంబంధించింది?
1) కాల్షియం
2) బేరియం
3) ఐరన్
4) కాపర్
8. పైరైటీస్ ఖనిజం ప్రధానంగా ఏ లోహానికి సంబంధించినది?
1) అల్యూమినియం
2) గోల్డ్
3) సిల్వర్
4) కాపర్
9. ఇత్తడి, కంచులో ఉండే సాధారణ లోహం ఏది?
1) జింక్
2) మెగ్నీషియం
3) కాపర్
4) అల్యూమినియం
10. జర్మన్ సిల్వర్‌లో లేని లోహం ఏది?
1) సిల్వర్
2) కాపర్
3) జింక్
4) నికెల్
11. లోహక్షయాన్ని నివారించడానికి ఏ లోహపు పూత పూస్తారు?
1) జింక్
2) టిన్
3) నికెల్
4) పైఅన్నీ
12. భూమిలో స్వేచ్ఛాస్థితిలో లభించే లోహం ఏది?
1) బంగారం
2) సిల్వర్
3) కాపర్
4) పైవన్నీ
13. బల్బుల ఫిలమెంట్‌లో ఉపయోగించే కఠినమైన లోహం?
1) బంగారం
2) టంగ్‌స్టన్
3) వెండి
4) ఇనుము
14. అత్యంత విద్యుద్వాహకత కల్గిన లోహం?
1) వెండి
2) బంగారం
3) అల్యూమినియం
4) రాగి
15. క్లోరోఫిల్‌లో ఉండే ప్రధాన లోహం?
1) ఐరన్
2) మెగ్నీషియం
3) కాపర్
4) జింక్
16. రక్తంలోని ఎరుపు వర్ణదం హిమోగ్లోబిన్‌లో ఉండే లోహం?
1) ఐరన్
2) మెగ్నీషియం
3) కాపర్
4) జింక్
17. ఎంజైముల్లో ఉండే ప్రధాన లోహం?
1) కాపర్
2) జింక్
3) ఐరన్
4) అల్యూమినియం
18. వంటపాత్రలకు ఎక్కువగా ఉపయోగించే స్టీలు?
1) క్రోమ్ స్టీలు
2) స్టెయిన్‌లెస్ స్టీలు
3) టంగ్‌స్టన్ స్టీలు
4) ఇన్వార్ స్టీలు
19. కార్నలైట్ దేని ధాతువు?
1) రాగి
2) మెగ్నీషియం
3) కాల్షియం
4) జింక్
20. ఎర్రని నేలలో ప్రధానంగా ఉండే లోహం?
1) ఐరన్
2) కాల్షియం
3) అల్యూమినియం
4) రాగి
21. దుక్క ఇనుములో గల కార్బన్ శాతం?
1) 0-1
2) 0.2-2
3) 3-4
4) 5-10
22. శస్త్ర చికిత్స సాధనాలు తయారు చేయ డానికి ఉపయోగించే మిశ్రమలోహం?
1) స్టెయిన్‌లెస్ స్టీలు
2) టంగ్‌స్టన్ స్టీలు
3) ఇన్వార్ స్టీలు
4) క్రోమ్ స్టీలు
23. విద్యుత్ నిరోధాలు తయారు చేయడానికి ఉపయోగించే మిశ్రమలోహం?
1) గన్ మెటల్
2) నిక్రోమ్
3) స్టీలు
4) ఇన్వార్
24. స్టెయిన్‌లెస్ స్టీలులో క్రోమియం శాతం?
1) 5-0
2) 12-20
3) 10-12
4) 6-10
25. లోహాల్లోకెల్లా అత్యంత సాగే గుణం కలిగింది?
1) బంగారం
2) రాగి
3) స్టీలు
4) ఇత్తడి
26. ఆహారపు పాత్రలకు టిన్ (తగరం)తో పూత పూస్తారు. కానీ జింక్‌తో కాదు. ఎందుకంటే?
1) తగరం కంటే జింక్ తక్కువ ప్రతిస్పందన (చర్యాశీలత) కలిగి ఉండటం వల్ల
2) జింకు తగరం కంటే ఖరీదైంది
3) జింక్, తగరం కంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉండటం
4) జింక్, తగరం కంటే ఎక్కువ ప్రతిస్పందనను కలిగి ఉండటం
27. స్టెయిన్‌లెస్ స్టీలు దేని మిశ్రమం?
1) ఐరన్, నికెల్
2) ఐరన్, క్రోమియం, నికెల్
3) ఐరన్, క్రోమియం,జింక్
4) ఐరన్, మాంగనీస్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment