వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. అసలు కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనే సందేహం కల్గవచ్చు.
చెట్లు పెరిగేందుకు గాలి, సూర్యరశ్మిలతో పాటు నీరు కూడా అవసరమే అన్న సంగతి మనందరికి తెల్సిందే. ఈ మూడింటి సాయంతో చెట్లు బీజ పోషకం (ఎండోస్పెర్మ్) అనే ద్రవ పదార్ధాన్ని తయారు చేసుకుంటాయి.
ఫలాలు ఏర్పడడానికి కావల్సిన కేంద్రకాలను తయారు చేయటంలో బీజపోషకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరి చెట్లలో బీజోత్పత్తి కోసం ఇలా ఏర్పడిన ద్రవమే కొబ్బరి నీళ్లు.
సాధారణంగా చాలా చెట్లలో ఫలాలు ఏర్పడేటప్పటికే బీజపోషక ద్రవం ఇంకిపోతుంది.
కొబ్బరి చెట్లలో మాత్రం ఫలదీకరణ తర్వాత ఏర్పడే 50 మిల్లీమీటర్ల పిందెలో కూడా అనేక కేంద్రకాలతో కూడిన స్పచ్ఛమైన ద్రవంగా బీషపోషణ ఉంటుంది.
తర్వాత దశలో కొబ్బరి కాయ పరిమాణం పెరిగినప్పటికీ చిప్ప ఏర్పడి, దాని గోడలపై బీజపోషణ ద్రవం తెల్లటి పొరలు, పొరలుగా పేరుకోవటం ప్రారంభిస్తుంది. ఈ దశలో పాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, పోషక పదార్థాలు, చెక్కర దీనిలో ఎక్కువగా ఉంటాయి.
అదే లేత కొబ్బరన్నమాట. ఆ తర్వాత కాయ పెరిగేకొద్దీ కణ విభజన జరగటం వల్ల బీజ పోషక ద్రవ పరిమాణం పెరుగుతూ కొన్నాళ్లకు పాలలాగా చిక్కగా మారిపోతుంది.
లేత కొబ్బరి కాయలో కొబ్బరి కంటే నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కాయపెరిగే కొద్ది నీళ్ల శాతం తగ్గుతుంది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment