ప్రోలయ వేమారెడ్డి ఏ ప్రాంతాన్ని పాలించాడు? - తెలుగు బిట్స్




prolaya vema reddy కోసం చిత్ర ఫలితం
1. మాలిక్‌ నాయబ్‌ను బందీగా పట్టుకున్నది? 
- అరవీటి సోమదేవరాజు

2. కాపయ్య నాయకుడు ఏ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు? 
- 1363లో భీమవరం - వరంగల్లు తాలూకాలో పద్మనాయకులతో జరిగిన యుద్ధంలో 

3. కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించినది? 
- 1336

4. కాపయ నాయకుడు ఏ సుల్తానుతో సంధి కుదుర్చుకొన్నాడు? 
- బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా.

5. 'రాచూరు దుర్గ విభాళ' ఎవరి బిరుదు? 
- ప్రోలయ వేమారెడ్డి.

prolaya vema reddy కోసం చిత్ర ఫలితం
6. ప్రోలయ వేమారెడ్డి ఏ ప్రాంతాన్ని పాలించాడు? 
- అద్దంకి ప్రాంతం.

7. కాపయ నాయకుని ధిక్కరించిన పాలకుడెవరు? 
- రేచర్ల సింగమ నాయకుడు

8. రేచర్ల సింగమ నాయకుడు స్థాపించిన స్వతంత్య్రరాజ్యం ?
- రాచకొండ

9. బహమనీ రాజ్యస్థాపనలో అల్లా ఉద్దీన్‌ హసన్‌గంగుకు సాయం చేసినది? 
- కాపయ నాయకుడు

10. ఆంధ్ర దేశాధీశ్వర బిరుదు ధరించిన పద్మనాయకుడు? 
- అసపోత నాయకుడు

11. రేచర్ల పద్మ నాయకుల రెండవ రాజధాని? 
- దేవరకొండ

12. రేచర్ల పద్మనాయకుల గురించి వివరించే గ్రంథం? 
- పద్మనాయక చరిత్రము వెలుగోటి వారి వంశావళి.

13. రేచర్ల వంశానికి మూల పురుషుడెవరు? 
- ఆయనగల్లు (నల్గొండజిల్లా) వాసి బేతాళ నాయకుడు.

14. కాకతి గణపతి దేవుని కొలువులో ప్రసిద్ధి చెందిన పద్మనాయకులు ? 
- దామా నాయడు, రుద్రమ నాయడు, ప్రసాదిత్య నాయడు.

15. రుద్రమదేవి సింహాసనమధిష్టించిటంలో సహాయపడిన రేచర్ల పద్మ నాయకుడు? 
- ప్రసాదిత్య నాయడు.

16. ప్రసాదిత్య నాయడు బిరుదులు? 
- కాకతి రాయ స్థాపనాచార్య, రాయపితా మహాంక.

17. 'పంచ్య పాండ్యదళ విభాళ' అనే బిరుదు ఎవరిది? 
- ఎర్రదాచనాయడు.

18. ఎర్ర దాచనాయకుని కుమారులు? 
- సింగమనాయడు, ఏచనా నాయడు.

19. ఏచనానాయకుని పెద్దకొడుకు ?
- సింగమ నాయడు.

20. 'అశీతి వరాల సింగమ నాయడ'ని ప్రసిద్ధి చెందినది? 
- సింగమ నాయడు.

21. జల్లిపల్లి కోటను ముట్టడించినది? 
- సింగమనాయడు.

22. సింగమ నాయడును హత్య చేయించినదెవరు? 
- సోమవంశ క్షత్రియుడు తంబళ జియ్య.

23. 'ప్రబంధ రత్నాకరం' సంకలన గ్రంథకర్త? 
- పెడపాటి జగ్గన్న

24. అనపోతా నాయడు అనంతరం రాజ్యానికి వచ్చినది? 
- రెండవ సింగమ నాయడు లేదా కుమార సింగభూపాలుడు.

25. అనపోతా నాయడు తరపున దేవరకొండను పాలించినది? 
- మాధవ నాయకుడు.

26. మాదా నాయకుని కుమారుడు? 
- పెదవేదగిరి.

27. 'ఏకశిలా నగర సమీప శాక్రవారణ్య దహన దావానల' అని కీర్తి గడించినది? 
- పెదవేదగిరి

28. రెండవ సింగమ నాయని కుమారుడు? 
- కుమార అనపోతా నాయడు.

29. 1386లో అనవేమారెడ్డిని వధించినది? 
- కుమార అనపోతా నాయడు.

30. విజయనగర రాజులతో మైత్రీ భావాన్ని పెంచుకున్నది? 
- కుమార అనపోతా నాయడు.

31. లింగమనీడు ఎవరి కుమారుడు? 
- కుమార మాదానీడు

32. సర్వజ్ఞ సింగ భూపాలుడు రెండవ రాజధాని ? 
- బెల్లంకొండ

33. 'రఫార్ణ వసుధాకరం' అనే అలంకార గ్రంథాన్ని రచించినది? 
- సర్వజ్ఞ సింగభూపాలుడు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment