ఇరాన్
»ఇరాన్ - జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్ ( ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ) నైఋతి
ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో
పర్షియా అని పిలవబడేది. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య
భూమి |
»ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ) మరియు ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ) మరియు ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ) మరియు ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు కలదు. |
»ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించినది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చినది. ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలు లు మరియు తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు. |
»దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది(50), శాసనకర్త ఫాతిమే అజోర్లు(40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు |
ఇరాన్ అసలు పేరు:
జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్ ( ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ) ఇరాన్ నినాదం : ఇస్తెఖ్‌లాల్, ఆజాది, జమ్హూరియ-ఎ- ఇస్లామీ ( "స్వతంత్రం, స్వేచ్ఛ, ఇస్లామీయ గణతంత్రం") ఇరాన్ జాతీయగీతం : సొరూద్-ఎ-మిల్లి-ఎ-ఇరాన్ ఇరాన్ రాజధాని : టెహరాన్ ఇరాన్ అధికార భాషలు : పర్షియన్ ఇరాన్ ప్రభుత్వం : ఇస్లామిక్ రిపబ్లిక్ - ప్రధాన లీడరు : అలీ ఖుమైనీ - అధ్యక్షుడు : మహ్‌మూద్ అహ్మద్ నెజాద్ - స్వాతంత్ర్యం : ఫిబ్రవరి 11, 1979 ఇరాన్ విస్తీర్ణం : మొత్తం 1,648,195 కి.మీ² ఇరాన్ జనాభా : 2005 అంచనా 68,467,413 ఇరాన్ జీడీపీ (PPP) 2005 అంచనా : మొత్తం $561,600,000,000 ఇరాన్ కరెన్సీ : ఇరానియన్ రియాల్ (ريال) (IRR) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment