రైట్ సోదరులు లేదా రైట్ బ్రదర్స్ (Wright Brothers) - మహా మహులు




రైట్ సోదరులు అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి విమానాన్ని కనిపెట్టారు. వీరి పేర్లు ఓర్విల్లే, విల్బర్.
విల్బర్ ఏప్రిల్ 16, 1867 న జన్మించారు , ఓర్విల్లే ఆగష్టు 19, 1871న జన్మించారు.
ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, మరియు విమాన చోదక మార్గదర్శకులు. 
wright brothers కోసం చిత్ర ఫలితం
మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి డిసెంబర్ 17, 1903 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 
1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. 
రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినారు.


wright brothers కోసం చిత్ర ఫలితం
 దాదాపు వందేళ్ళ క్రితం రైట్ బ్రదర్స్ యంత్ర శక్తితో గాలిలో ప్రయాణించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయాణంలో కేవలం కొన్ని అడుగుల ఎత్తు ఎగిరి, కొన్ని అడుగుల దూరం మాత్రమే ప్రయాణం చేశారు. అలాంటి అనేక ప్రయత్నాలను చేస్తూ, అనేక ప్రయత్నాలలో విఫలం అవుతూ, కాస్త కాస్త సాఫల్యాన్ని అనుభవంలో జోడించుకుంటూ చివరికి యంత్ర శక్తితో కొన్ని వందల మీటర్ల వరకు ఎగిరే విమానం తయారు చేశారు.
wright brothers కోసం చిత్ర ఫలితం
రైట్ బ్రదర్స్ అంటే విల్బర్ రైట్, ఆయన తమ్ముడు ఒర్విల్లే రైట్ లు. స్ధిరమైన రెక్కలతో కూడిన మొట్టమొదటి విమానాన్ని యంత్రశక్తి సహాయంతో గాలిలో ప్రయాణించే విమానాన్ని తయారు చేసిన ఖ్యాతి వీరి సొంతం. రైట్ బ్రదర్స్ కంటే ముందే మనవాళ్లు గాలిలో ఎగిరేందుకు ఫార్ములా తయారు చేశారని, చిత్ర పటాలు గీసుకున్నారని కొందరు చెబుతారు.
ఉత్తర కరోలినా లోని బిగ్ కిల్ డెవిల్ పేరుతో ఉన్న కొండ మీది నుండి విల్బర్ రైట్ మొదటిసారిగా అక్టోబర్ 10, 1902 తేదీన గ్లైడర్ సహాయంతో కిందికి ఎగురుకుంటూ వచ్చాడు. 
wright brothers కోసం చిత్ర ఫలితం
రైట్ బ్రదర్స్ ఇద్దరూ తమ సైకిల్ షాప్ వెనుక భాగంలోని వర్క్ షాపులో తమ మొదటి విహంగ ప్రయోగాలకు కావలసిన సరంజామా తయారు చేసుకున్నారు. మొదటిసారి ఎగిరిన గ్లైడర్ పైన తమ్ముడు ఒర్విల్లే పడుకుని ప్రయాణం చేశాడు. ప్రారంభంలో గ్లైడర్లకే వివిధ రూపాలు మార్చుతూ సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయత్నాలు చేశారు.
1903లో వారు మొట్టమొదటిసారిగా యంత్రం అమర్చిన గ్లైడర్ ని తయారు చేశారు. దానినే మొదటి యంత్ర విమానంగా చెబుతున్నారు. రెండు చెక్క ప్రొపెల్లర్ లను అమర్చి 12 HP ఇంజన్ ను ప్రత్యేకంగా తయారు చేసి విమానానికి అమర్చారు. 1903 డిసెంబర్ 14 తేదీన ఈ విమానంతో ఎగరడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అనంతరం డిసెంబర్ 17 తేదీన 12 సెకన్ల పాటు కొద్ది అడుగుల ఎత్తులో 120 అడుగుల దూరం ప్రయాణించి చరిత్ర సృష్టించారు. పెద్ద రైట్ స్ధిరత్వం కోసం ఒక పక్క రెక్కను పట్టుకుని కొన్ని అడుగులు వేసి వదిలివేయగా, చిన్న రైట్ విమానంపై పడుకుని ప్రయాణం చేశాడు.
wright brothers కోసం చిత్ర ఫలితం
అనంతరం 1904 మే నెలలో రైట్ బ్రదర్స్ రెండో యంత్ర విమానాన్ని తయారు చేశారు. ఒహియో రాష్ట్రంలో హాఫ్ మన్ గడ్డి నేలలపై నుండి ఎగరడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలలో కాస్త కాస్త సఫలం అవుతూ 1905, సెప్టెంబర్ 29 తేదీన 60 అడుగుల ఎత్తుకు ఎగిరారు. ఆ విమానానికి ఫ్లైట్ 41 అని పేరు పెట్టారు. ఇందులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూర్చునేలా రెండు కుర్చీలు అమర్చారు. దీనిని రీ మోడలింగ్ చేస్తూ 1908 వరకూ ప్రయోగాలు చేశారు.
wright brothers కోసం చిత్ర ఫలితం
రైట్ బ్రదర్స్ ప్రయోగాలు సఫలం అయ్యే కొద్దీ వారికి కావలసిన నిధులను సమకూర్చేందుకు అమెరికా ఆర్మీ ముందుకు వచ్చింది. ఆ విధంగా గాలిలో ప్రయాణించే పరిజ్ఞానం అభివృద్ధి కావడానికి మిలట్రీ అవసరాలే దోహదం చేశాయి. మిలట్రీ అవసరం అంటే ప్రత్యర్ధి దేశపు కంపెనీలపై పై చేయి సాధించడమే అని వేరే చెప్పనవసరం లేదు. అయితే మిలట్రీ అధికారికి ఎగురుతున్న అనుభవం చూపడానికి రైట్ బ్రదర్స్ చేసిన మొదటి ప్రయోగంలోనే మిలట్రీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు.
అంతిమంగా 1909 జులై నాటికి రైట్ సోదరులు అమెరికన్ మిలట్రీకి తమ విమానాన్ని అమ్మగలిగారు. ఆ విధంగా మొట్టమొదటి విమానాన్ని సొంతం చేసుకున్న సంస్ధగా అమెరికన్ ఏరోనాటికల్ డివిజన్ అవతరించింది.







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment