మధుమేహానికి ఇన్సులిన్‌ను కనుగొన్నది ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్




1. మలేరియా పారసైట్‌ను కనుగొన్నది ఎవరు?
సర్ రోనాల్ట్ రాస్


2. మధుమేహానికి ఇన్సులిన్‌ను కనుగొన్నది ఎవరు?
బాంటింగ్

Image result for ఇన్సులిన్‌

3. అంబర్ ప్యాలెస్ ఎక్కడ ఉన్నది? 
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్. 


4. అక్బర్ సమాధి ఎక్కడ ఉన్నది?
ఆగ్రాలోని సికనారా.


5. బృందావన్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నది?
కర్నాటక రాష్ట్రంలోని మైసూరు.


6. జలియన్‌వాలాభాగ్ దుర్ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది?
1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన జరిగింది.


7. రౌలట్ చట్టం ఎప్పుడు అమలలోకి వచ్చింది?
1919 సంవత్సరం మార్చి 18వ తేదీ.


8. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది?
1885 సంవత్సరం


9. ఏటీఎమ్ అనగా ఏమిటి?
ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్


10. యూపీఎస్ దేనికి సంక్షిప్తనామం?
అన్‌ఇంటరప్టడ్ పవర్ సప్లై


11. పీసీ దేనిని సూచిస్తున్నది?
పర్సనల్ కంప్యూటర్


12. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూను విడమరిచి చెప్పండి?
వరల్డ్ వైబ్ వెబ్


13. ఎల్ఏఎన్‌ను సంక్షిప్తనామాన్ని విడమరచి చెప్పండి?
 లోకల్ ఏరియా నెట్‌వర్క్


14. డబ్ల్యూఏఎన్‌ను విడమరచి చెప్పండి?
వైడ్ ఏరియా నెట్‌వర్క్


15.అకస్టిక్స్ శాస్త్రం దేనికి సంబంధించింది?
శబ్దాలను అధ్యయనం చేసేందుకు అకస్టిక్స్ శాస్త్రం ఉపకరిస్తుంది.


16. యుద్ధాలలో తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్‌ను దాడి చేసే ఆయుధంగా ఎప్పుడు ఉపయోగించారు
1911 సంవత్సరంలో టర్కీ-ఇటలీ దేశాలకు మధ్య జరిగిన యుద్ధంలో తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్‌ను దాడి చేసే ఆయుధంగా ఉపయోగించారు.


17. రిఫ్రిజిరేటర్‌ను ఎవరు కనుగొన్నారు?
అమెరికాకు చెందిన అలెగ్జాండర్ ట్వైనింగ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్‌లు రిఫ్రిజిరేటర్‌ ఆవిష్కరణలో సంయుక్తంగా పాలు పంచుకున్నారు


18.బంగ్లాదేశ్ తొలి ప్రధాని ఎవరు?
ముజిబుర్ రెహ్మన్

19.ప్రపంచంలో అతి పొడవైన నది?
నైలూ నది

20.ప్రపంచంలో అతి పొడవైన హైవే?
ట్రాన్స్-కెనడా హైవే


21.ప్రపంచంలో అతి పెద్దదైన ఎడారి?
సహారా ఎడారి

22.ప్రపంచంలో ఎత్తైన ప్రర్వతం?
ఎవరెస్టు పర్వతం

23.పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలను వేరుచేసే సరిహద్దు పేరు?
డ్యూరాండ్ లైన్




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment