తరాలు మారేకొద్దీ మనిషి బుద్ధి మారుతుందని నేటి మానువుడు నిరూపిస్తే.. ఎన్ని జన్మలెత్తినా మరెన్ని తరాలు గడచినా కుక్కకున్న విశ్వాసం మరే జీవిలో ఉండదని ఓ శునకం నిరూపించింది. అర్జెంటినాలో ఓ కుక్క తనను సాకిన యజమాని మరణించినా తిరిగి వస్తాడంటూ ఆరేళ్లుగా అతని సమాధి వద్దనే గడుపుతోంది. యాజమాని లేడన్న బాధతో అతని సమాధి వద్దనే ప్రదక్షిణలు చేస్తోంది..!
అర్జెంటినాలోని విల్లాకార్లోస్ పేజ్ పట్టణానికి చెందిన మిగ్యూల్ గుజ్‌మాన్ ఓ కుక్క పిల్లను పెంచాడు. ఐతే 2006లో మిగ్యూల్ అనారోగ్యంతో మృతి చెందాడు. తన యజమాని శవాన్ని పట్టణంలోని శ్మశానవాటికలో పూడ్చిపెడుతున్న సమయంలో కుక్క ఆ తంతును చూస్తే అక్కడే గడిపింది.
ఆ తర్వాత తన యజమాని కోసం ఆరేళ్లుగా ఆ సమాధిని విడువక ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోంది. తను పెంచిన యజమాని మరణించినా సమాధినే అంటిపెట్టుకుని వున్న కుక్కకు హ్యాట్సాఫ్ చెపుతున్నారు అక్కడి జనం.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment