“యోగా” అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి త్రిప్పడం అని అర్ధం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు త్రిప్పటం లేక తల్లక్రిందులుగా నుంచోవటం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం . మీరు అన్నిటితో ఐక్యం అయితే, అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు?
ఈ రోజు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అని, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అని చెప్తుంది. ప్రపంచ మతాలు కూడా ‘దేవుడు అంతటా ఉన్నాడు’ అని చెప్తున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్త పరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాన్ని నమ్ముతాడు, కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు – అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు.
ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠ యోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది – కేవలం భౌతిక అంశానికి మాత్రమే పాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే, ‘టెన్నిస్ ఆడండి లేదా నడవండి’ అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు, దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలా మంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు, కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినై మూర్ఖంగా చేస్తే, దాని వల్ల మీకు హాని కలుగుతుంది.
హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అధ్బుతమైన ప్రక్రియ అవుతుంది. హఠ యోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగై పోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చెలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి
యోగా అన్న పదం 'యజ్' అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యోగా అంటే కలిసి ఉండటం, చేర్చడం, జతకట్టడం మరియు మనసు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనం అని చెప్పవచ్చు. సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ, సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండటం యోగాలోని మూలార్ధం. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనాన్ని పొందే మహత్తర అవకాశం ఒక్క యోగా ద్వారానే కలుగుతుంది.
ఆధ్యాత్మిక మార్గాల్లో ఒకటైన యోగా... చేరవలసిన గమ్యం వైపు సక్రమంగా అడుగులు వేసేలా తీర్చిదిద్దుతుంది. మనసుకు స్థిరత్వాన్ని కలిగించి ఖచ్చితమైన మార్గ సంకేతాలతో నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చేరుకునేలా మలుస్తుంది. ఇందుకోసం ప్రధానంగా మూడు రకాల సూచికలున్నాయి. అవి ఆరోగ్యకరమైన జీవన విధానం, నైతిక నియంత్రణ, స్వీయ నియంత్రణ.
ఈ సూచికల సంయుక్త ప్రభావంతో భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ విధానాలు, నియంత్రణలపై శ్రద్ధ చూపుతారో వారు తప్పనిసరిగా మనసుపై ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. దీనివల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి పునరుజ్జీవనం పొందుతుంది. ఒక్కసారి మెదడు సామరస్యంతో స్ఫూర్తిని కలిగి ఉంటే ఆలోచనలు కూడా హద్దుల్లోనే ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్ది యోగసాధకుడు... తన మెదడు తాలూకు కార్యకలాపాల్లో చురుకైన, ఆశావహ దృక్పధమైన రూపాంతరాన్ని అనుభవిస్తాడు. ఈ మార్పు ఖచ్చితంగా జీవన విధానంపై ప్రతిబింబిస్తుంది.
యోగా పద్ధతులు
యోగాలో రెండు రకాల పద్ధతులున్నాయి. వాటిలో ఒకటి దైహికం, రెండు ఆధ్యాత్మికం. ఆసనాలు, క్రియలు, బంధం, ప్రాణాయమం మొదలైన నాలుగు రకాల ముద్రలు దైహిక పద్ధతుల్లో ముఖ్యమైనవి. సరైన శిక్షణతో నాలుగు ముద్రలు గల వ్యాయామాలను అనుసరిస్తూ.. అదేసమయంలో నిబంధనలను పాటిస్తుంటే ఆధ్యాత్మిక పురోగతిని కూడా సాధించవచ్చు. స్వీయానుభవం, మనోనియంత్రణ వంటివి ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నాయి. ఈ ప్రత్యేకతలకు నేటి యోగా గురువులే ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తారు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment