వీలునామా అనగా ఒక వ్యక్తి తన తదనంతరం
తన ఆస్తిపాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము. భవిష్యత్ జీవితం
సాఫీగా సాగాలనే ఉద్యేశ్యంతో ప్రతీఒక్కరు తాము సంపాదించిన దాంట్లో కొంత దాచుకుంటారు.
అలా దాచుకున్న మొత్తాన్ని స్థిరాస్తి, చరాస్తి రూపంలో కొంత మొత్తాన్ని జాగ్రత్త పరుచడం
మనం చూస్తుంటాం. అయితే అలా దాచుకున్న మొత్తాన్ని, లేదా ఆస్తులను తమ తదనంతరం తమకిష్టమైన
వారికి చెందేలా తమ అభిప్రాయాన్ని రాసి భద్రపరుచుకునే సాధనమే వీలునామా.
దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి.
2005 హిందూ వారసత్వ
సవరణ చట్టం ’56 చట్టంలోని లొసుగులు తొలగించి, పూర్వీకుల ఆస్తి లో కూడ మగవారితో సమానంగా, పుట్టుకతోనే ”కోపార్సినరి” హక్కు కల్పించింది.
ఏవిధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా
పేర్కొంది. హక్కులతోపాటు బాధ్యతలు కూడ వుంటాయని చెప్పింది. అలాగేే వ్యవసాయ భూములలో
కూడ హక్కులు యిచ్చింది. పుట్టినింటి నివాస గృహంలో తన వాటా తన యిష్ట ప్రకారం తీసుకోవచ్చని
కూడ హక్కు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు ఆడపిల్లకి వచ్చేయో, ఆ హక్కులు ఆమెకి
సంపూర్ణహక్కు అని, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి యివ్వడానికి, లేక అమ్ముకోవడానికి
గాని ఆమెకి పూర్తి హక్కులు వున్నాయని ఉద్ఘాటించింది.
ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా యిచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మటు్టక్క హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినది’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో వీలునామా లేని ఎడల సమాన వాటా పొందే హక్కు పొందింది. ఈ వచ్చిన ఆస్తిహక్కు ఆ ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుందని ఆశిద్దాం.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment