ఈ యాప్స్ ఉంటే చదువు ఇక ఈజీ...!


Dragon Dictation
ఢ్రాగన్ డిక్టేషన్ అనేది ఓ యాప్. ఇది వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. మీరు మాట్లాడితే ఆ మాటల్ని రికార్డు చేసుకుంటుంది. తరవాత వాటిని టెక్స్‌ట్ రూపం లో అందజేస్తుంది. దీనిని కంప్యూటర్‌కు అనుసంధానించడంద్వారా అ టెక్స్‌ట్‌ను ప్రిం ట్ తీసుకోవచ్చు. టైప్ చేయడం రానివాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరం. అలాగే అకస్మాత్తుగా నివేదికలు తయారు చేయాలన్నా, రికార్డులు రాయాలన్నా, డాక్యుమెం ట్లు ప్రిపేర్ చేయాలన్నా సునాయాసంగా చేయొచ్చు. మీరు చదివేస్తే డ్రాగన్ డిక్టేషన్ రికార్డు చేసుకుంటుంది. దాని ప్రింట్ మీరు తీసుకోవచ్చు. అంతేకాదు, ఈ యాప్‌ను సోషల్ మీడియా అకౌంట్స్‌కు లింక్ చేసి ట్విట్టర్, ఫేస్‌బుక్‌వంటివాటిని అప్‌డేట్ చేసుకోవచ్చు కూడా. బాగుంది కదూ! ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఎ లా ఉపయోగించాలో వివరంగా యూ ట్యూబ్‌లో లెసన్స్ కూడా ఉన్నాయి.


Evernote
ఇది మరో యాప్. వీడియోలు, ఫొటోలు, ఆడియో, టెక్స్‌ట్ ఇలా సమస్త సమాచారాన్ని పొందు పరచుకునే యాప్ ఇది. విద్యార్థులయితే తమ స్టడీ మెటీరియల్‌ను ఇందులో స్టోర్‌లో చేసుకోవచ్చు. మీరు లెక్చరర్ అయి తే నేరుగా ఎవర్‌నోట్‌లో రాసుకుని, కంప్యూటర్ ద్వారా దాని ప్రింట్ తీసుకోవచ్చు. క్లాసులో టీచర్ చెప్పే పాఠాన్ని ఇందులో రికార్డు చేసుకుని, తీరిగ్గా ప్రింట్ తీసుకుని చదువుకోవచ్చు.


Dictionary.com Mobile
స్టూడెంట్లు చదువుకుంటున్నప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకోవడం ఉత్తమం. ఎప్పుడు ఏ పదానికి అర్థం కావలసి వచ్చినా వెంటనే చూసుకోవచ్చు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు డిక్షనరీ కావాలంటే ఎలా? అలాంటివారికోసం రూపొందిందే డిక్షనరీ డాట్ కామ్ మొబైల్ యాప్. ఇందులో 20 లక్షలకు పైగా పదాలకు అర్థాలు, పర్యాయ పదాలు, సమానార్థకాలు వంటివి ఉంటాయి. ఈ యాప్ ఉంటే డిక్షనరీ మీ వెంట ఉన్నట్టే. మీరు చేయాల్సిందల్లా...దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడమే.


Babylon
కొందరికి ఇంగ్లీష్ డిక్షనరీ ఒక్కదానితోనే పనికాదు. ఇతర భాషలతో కూడా పని ఉం టూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ డిక్షనరీ లేకపోతే తంటాయే. ఈ కొరత తీర్చేందుకు వచ్చిందే బాబిలోన్ యాప్. 75 భాషల్లో ము ఖ్యమైన పదాలు, వాటికి అర్థాలను ఈ యాప్ అందిస్తోంది. స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలను అధ్యయనం చేసే విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతం. ఐఓఎస్, ఆండ్రాయిడ్ సౌ కర్యం ఉన్న స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Blackboard
ప్రపంచవ్యాప్తంగా అనేక యూనివర్శిటీ లు, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలూ వినియోగిస్తున్న మొబైల్ యాప్ ఇది. ఆండ్రాయి డ్, బ్లాక్‌బెర్రీ, యాపిల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, సంబంధిత విద్యాసంస్థలో ప్రొఫెసర్ లేదా లెక్చరర్ లేదా టీచర్ ఈ యాప్‌ను వాడుతున్నట్టయితేనే విద్యార్థులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుం ది. టీచర్ పోస్టు చేసే గ్రేడ్లు, కోర్సు, టైమ్‌టేబిల్స్ వంటివాటినన్నింటినీ విద్యార్థికూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సంబంధిత విద్యాసంస్థ ఈ యాప్‌ను వాడుతున్నట్టయితే, అందులో చదివే వేలాది విద్యార్థులు ఈ యాప్‌ను వినియోగించవచ్చు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment