భూమికి, చంద్రుడికి మధ్య దూరం తగ్గినప్పుడు చంద్రుడు మరింత పెద్ద కనిపిస్తాడు. ఈ చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. అదే సూపర్ మూన్ సమయంలో గ్రహణం ఏర్పడితే దాన్నే బ్లడ్ మూన్గా పిలుస్తారని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 33 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరగని.. మరో 18 సంవత్సరాల పాటు జరగబోని మహాద్భుతాల్లో ఒకటైన సూపర్ మూన్ మరో నాలుగు రోజుల్లో కనువిందు చేయనుంది.
అదీ 28న ఆకాశంలో అరుదైన చంద్ర గ్రహణం సంభవించనుంది. దీన్ని వీక్షించేందుకు శాస్త్రజ్ఞులు, రీసెర్చులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మహాద్భుతాన్ని మనం చూడలేం. ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని పూర్తిగా చూడగలుగుతారు.
భారత కాలమానం ప్రకారం ఇది సోమవారం (సెప్టెంబర్ 28) ఉదయం 7:40 గంటలకు ప్రారంభమై గంటా 12 నిమిషాలు కొనసాగి 8:52 వరకూ ఉంటుంది. అంటే మనం బ్లడ్ మూన్ను చూసే అవకాశాలు లేవు. తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని చోట్ల ఈ గ్రహణం కనిపిస్తుందని నాసా వెల్లడించింది. ఇదిలావుండగా, ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతు గ్రహం సంచరిస్తున్న వేళ చంద్రగ్రహణం సంభవిస్తుందని, ఈ గ్రహణం కనిపించకపోయినా.. మేషం నుంచి మీనం వరకూ అన్ని రాశులపైనా గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment