ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రామన్ మెగసెసె.
జపాన్ దాస్య శృంఖలాల నుండి ఫిలిప్పీన్స్కు విముక్తి కలిగించడం కోసం తన ప్రాణాలను
సైతం లెక్క చేయకుండా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా
పోరాడిన వీర సైనికుడు మెగసెసె.
1953లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్కు మూడో అధ్యక్షుడిగా
ఎన్నికయ్యారు రామన్ డెల్ ఫియర్ మెగసెసె. ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం రామన్
ఫిలిప్పీన్స్ను అభివృద్ధిపథంలో నడి పించాడు.
కోల్డ్‌వార్ సమయంలో, దక్షిణాసి యాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరా టం చేశారు.
'సౌత్ ఏషియా ట్రీటీ ఆర్గనై జేషన్'ను స్థాపించి దక్షిణాసియా దేశాల న్నింటిని ఒక్క తాటిపై నడిపించారు. ఫిలిప్పీన్స్ ను అభివృద్ధి దిశగా నడిపిన యోధుడు రామన్ సామాజిక
సేవలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.
1957 మార్చి 17వ తేదీన ఒక విమాన ప్రమాదంలో మెగసెసె మృతి చెందారు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుమీద 1957 ఏప్రిల్ మాసంలో
న్యూయార్క్‌లోని 'రాక్‌ఫెల్లార్ బ్రదర్స్' ఫౌండేషన్ వారు మెగసెసె అవార్డును నెలకొల్పారు.
వివిధరంగాల్లో కృషిచేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు.
ఆసియా నోబెల్‌గా పేరొందిన ఈ అవార్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్‌షిప్,
జర్నలిజం, లిటరేచర్, శాంతి తదితర రంగాలలో సేవ చేసిన వారికి ఇస్తారు.
ఇంకా చదవండి :
**అంతర్జాతీయ అవార్డులు వాటి వివరాలు
**నోబెల్ బహుమతులు
**భారత రత్న అవార్డు
**జ్ఞాన్ పీట్ అవార్డ్
**సరస్వతీ సమ్మాన్ అవార్డు
**చలన చిత్ర అవార్డులు (FILM AWARDS)
**మహామహులు
|