ఆ ఊర్లో గాలిపటం ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారట ? - మీకు తెలుసా




-->  ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కొసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం అంటారు పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు.
kites కోసం చిత్ర ఫలితం

-->  గాలిపటం ఎగరడానికి ముఖ్యంగా దారంలోని బలం (tension) ప్రధానమైన కారణం
దీనికి కావలసిన లిఫ్ట్ గాలి మూలంగా కలుగుతుంది. గాలిపటం డిజైన్ వలన గాలిపటం పైభాగంలో తక్కువ ఒత్తిడి క్రింది భాగంలో ఎక్కువ ఒత్తిడి కలిగి ఎగురగలుగుతుంది. ఇదే మూలసూత్రం గాలివీచే దిక్కుగా ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. ఈ రెండు బలాలకు దారం లేదా దారాలలోని బలం వ్యతిరేకదిశలో పనిచేసి గాలిపటాన్ని నియంత్రిస్తుంది.
kites కోసం చిత్ర ఫలితం
-->  చెన్నైలో గాలిపటాలు ఎగరేస్తే జైల్లో పెడతారు. చెన్నై పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం గాలిపటాలు ఎగరేయడం నేరం. గాలిపటాలను ఎగరేయడానికి ఉపయోగించే దారాని (మాంజా)కి గాజు పెంకులతో తయారు చేసిన పొడి పూస్తారు. దీనివల్ల దారం చాలా పదునుగా మారి తెగుతుంది. మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మాంజా వల్ల గాయపడి ఓ బాలుడు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment