యమధర్మ రాజును పూజించే దేశం - నేపాల్ (Nepal) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం




నేపాల్ 
nepal map కోసం చిత్ర ఫలితం
=> నేపాలు కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు.
lord budha కోసం చిత్ర ఫలితం

=> క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాలు లోని దక్షిణ ప్రాంతాలను పరిపాలించాడు. అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాణ్ అను ప్రాంతమున నివసించు సుక్ష్యత్రియుడు అగు ఒక బౌద్ధ భర్మధీక్షాపరాయణుడికిచ్చి వివాహము చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుచున్నారు.
prudhvi narayan shaa కోసం చిత్ర ఫలితం
=> 1768 లో పృథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాలు ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది  1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కిం ను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు.
jang bahadur rana కోసం చిత్ర ఫలితం
=> షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 
tribhuvan కోసం చిత్ర ఫలితం
=> భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాలు పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెసు పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాలును పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజల ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు.
=> 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాలు లో ఎన్నికలు జరిగాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్టు పార్టీలకు ఎక్కువ ఓట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయింది.
=> ఫిబ్రవరి 1996 లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి, సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.

deependra nepal murder కోసం చిత్ర ఫలితం
=> నేపాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పినతల్లులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కోమాలో ఉన్నా, సాంప్రదాయం ప్రకారం అతడిని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.
deependra nepal murder కోసం చిత్ర ఫలితం
=> అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. 
birendra nepal murder కోసం చిత్ర ఫలితం   birendra nepal murder కోసం చిత్ర ఫలితం

gyanendra nepal కోసం చిత్ర ఫలితం
=> భారత్ మరియు చైనా మధ్యలో  1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉన్నది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉన్నది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో (ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాలు లో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది.

mount everest కోసం చిత్ర ఫలితం
=> ఎవరెస్టు శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉన్నది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి.
nepal poor country కోసం చిత్ర ఫలితం                 nepal poor country కోసం చిత్ర ఫలితం
=> ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాలు ఒకటి, సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కెర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది.
=> నేపాల్‌ జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు.
కార్తీక మాసం కోసం చిత్ర ఫలితం
=> నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్బంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంబ మౌతాయి.
lord yama కోసం చిత్ర ఫలితం
=> యమధర్మ రాజు పండగ కొక ఇతిహాసము కలదు. దాని ప్రకారం:
పండగ దినాల్లో కూడ భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా. యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.
crow కోసం చిత్ర ఫలితం
=> యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులు దూతలు బావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా వుపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు. 
dog కోసం చిత్ర ఫలితం
=> రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులు గా నల్లని కుక్కలను పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు.
గోమాత కోసం చిత్ర ఫలితం
=> మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనం లో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు.
ఎద్దులను కోసం చిత్ర ఫలితం
=> నాల్గవ రోజున కూడ ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడ స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు.
యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా కోసం చిత్ర ఫలితం
=> ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి బోజనం చేస్తాడని వీరి నమ్మిక ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడ లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి.
=> ఈవిధంగా .... హిందువులు అధికంగా వున్న నేపాల్ దేశంలో హిందూ సాంప్రదాయ పండగలు అనేకం జరుపుకుంటారు.
passport / visa కోసం చిత్ర ఫలితం
=> మొన్నటి దాక రాజుల పరిపాలనలో వున్న నేపాల్ దేశం ప్రపంచంలో వున్న ఎకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే వున్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు
=> నేపాల్ లోని ద్రవ్యము ను కూడ రూపాయి అంటారు. భారత్ రూపాయిని ఐ.ఆర్ అని నేపాల్ రూపాయిని ఎన్.ఆర్. అని అంటారు. ద్రవ్య మారకానికి చాల చోట్ల అవకాశం వున్నది. కాని నేపాల్ లోని ప్రతి దుకాణంలోను, ఇతర ప్రదేశాలలోను భారత్ రూపాయిని తీసుకుంటారు. భారత్ రూపాయలు వందకు నేపాల్ రూపాయలు నూట అరవై ఇస్తారు.
kathmandu కోసం చిత్ర ఫలితం       kathmandu కోసం చిత్ర ఫలితం

=> పోక్రా నుండి  ఖాట్మండు కు పోయే దారిలో ఈ మనో మామని ఆలయం ఒక పెద్ద కొండపై వున్నది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనె వున్నది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి వున్నది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే" ఏర్పాటు వున్నది.  ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. 

pashupatinath temple nepal కోసం చిత్ర ఫలితం
=> హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతి నాద్ ఆలయం. ఇది శివాలయం  ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమె ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది వున్నది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం వున్నది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్బ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది వున్నది. ఆలయ ప్రాంగణం లో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి
స్యయంభూనాధ్,బోద్ద్ నాధ్ దేవాలయము లకు ఇతిహాసము కలదు. దాని ప్రకారం:
boudhanath and swayambhunath in nepal కోసం చిత్ర ఫలితం  boudhanath and swayambhunath in nepal కోసం చిత్ర ఫలితం

=>  నేపాళ దేశమున నాగవాసము అనుపేరుగల గొప్ప సరోవరము నుండెనట, ఈ సరోవరమున కర్కోటకుడగు 'నాగరాజూ పరిపాలించుచుండెను. ఆకాలములో నాగసరోవరము నందు ఒక్క తామరమొక్క అయినా మొలవకుండెడిదట అంతకు చాలాకాలము క్రిందట విందుమతీ నగరమునుండి విపస్య బుద్దుడు ఈసరోవరమునకు వచ్చినప్పుడు అతడొక తామర మొక్క మంత్రించి ఈసరోవరమున పారవైచి "ఈతామర పుష్పించిననాడు స్యంభువుడగు బుద్దభగవానుడు జ్యోతివలె భక్తులకు కనపడునని" చెప్పి వెడిలిపోయినాడట ఈ కారణముచేతనే స్యయంభూనాధ్, బోద్ద్ నాధ్ దేవాలయములందు జ్యోతి ఎల్లప్పుడు వెలుగుచూనే ఉండును

nepal flag కోసం చిత్ర ఫలితం

నేపాల్  నినాదం  :  जननी जन्मभूमिष्च स्वर्गादपि गरीयसी ( జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ)
నేపాల్  జాతీయగీతం  :  రాష్ట్రీయ గాన్
నేపాల్  రాజధాని  :  ఖాట్మండు
నేపాల్  అధికార భాషలు  :  నేపాలీ
Gyanendra కోసం చిత్ర ఫలితం
నేపాల్  రాజు  :  Gyanendra
Girija Prasad Koirala కోసం చిత్ర ఫలితం
నేపాల్  ప్రధాన మంత్రి  :  Girija Prasad Koirala
నేపాల్  విస్తీర్ణం  :  147,181 కి.మీ²
నేపాల్  జనాభా  :  27,133,000
నేపాల్  జీడీపీ  :  $42.17 billion
నేపాల్  కరెన్సీ  :  రూపాయి (NPR)nepal currency కోసం చిత్ర ఫలితం

nepal currency కోసం చిత్ర ఫలితం

nepal currency కోసం చిత్ర ఫలితం

nepal currency కోసం చిత్ర ఫలితం






















0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment