» కాశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన చినాబ్ నదిపై
నిర్మిస్తోంది. జమ్మూ-ఉధంపూర్-కట్రా-ఖ్వాజిగుండ్-బారముల్లాలను కలుపుతూ
భారతదేశంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన చినాబ్ బ్రిడ్జి 2016 కల్లా
పూర్తి కావస్తోంది. |
» 2003లో ఈ అతిపెద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం 359మీటర్ల ఎత్తు వద్ద పూర్తిచేస్తే అది ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్ల ఎత్తులో ఉంటుంది. |
» కేబుల్ క్రేన్ల సాయంతో తోరణాల మాదిరిగా ఉక్కు స్తంభాలను నిలబెట్టి వంతెనను నిర్మిస్తున్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో భారీ వస్తువులను వంతెన వద్దకు తరలించేందుకు హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తున్నారు. |
» ఈ బ్రిడ్జి నిర్మాణం వలన బారాముల్లా నుండి జమ్మూకు గల 6గంటల 30నిమిషాల ప్రయాణ కాలం దాదాపు సగానికి తగ్గబోతోంది. |
» మొత్తం 25 వేల టన్నుల ఉక్కును వాడుతున్నారు. నదీప్రవాహానికి ఆటంకం లేకుండానే బ్రిడ్జిని నిర్మించడం అనేది పెద్ద సవాలుగా మారిందని అయినా, 2016 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. |
» ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు 552కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తై రైల్వే వంతెన చైనాలోని గిర ప్రావిన్స్‌లో బీపాన్‌జియాంగ్ నదిపై ఉంది. ఆ వంతెన ఎత్తు 275 మీటర్లు కాగా 84 మీటర్లు ఎక్కువ కానుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది. భూకంపం వచ్చినా తట్టుకుంటుంది. |
» కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ వంతెనకు రూ. 552 కోట్ల వ్యయం కానుందని అంచనా. |
» ఇక ఈ బ్రిడ్జి నిర్మాణం గనుక పూర్తయితే ప్రస్తుతం ప్రపంచంలోనే
అతిపెద్దదైన చైనా బ్రిడ్జిను అధిగమించి చీనాబ్ బ్రిడ్జి మొదటి స్థానానికి
చేరుకుంటుంది. |
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనను భారత్ ఎక్కడ నిర్మిస్తోంది - మీకు తెలుసా ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment