అబ్‌ఖజియా
¤అబ్‌ఖజియా కాకస్ పర్వతాల ప్రాంతంలో ఉన్న ఒక భూభాగం. ఇది దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినగణతంత్ర దేశం, అంతర్జాతీయంగా దీనికి దేశంగా గుర్తింపులేదు. ఒక్క జార్జియా దేశం మాత్రం అబ్‌ఖజియాను గుర్తించింది. ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు అబ్‌ఖజియాను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. కాని జార్జియా దేశం మాత్రం దీనిని స్వయం పరిపాలనా ప్రతిపత్తిగల గణతంత్ర దేశం గా గుర్తించింది. |
¤క్రీ.పూ. 9వ శతాబ్దం నుండి ఈ ప్రాంతం పురాతన జార్జియా రాజ్యం లో భాగంగా ఉండేది. గ్రీకు వర్తకులు వలస వచ్చి నల్ల సముద్రం తీరంలో రేవు పట్టణాలు అభివృద్ధి చేశారు. తరువాత క్రీ.శ. 1వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం ఎగ్రిస్‌ను తనలో కలుపుకొంది. |
¤క్రీ.శ. 16వ శతాబ్దంలో జార్జియా రాజ్యం విచ్ఛిన్నమైనపుడు ఈ ప్రాంతం ఒట్టొమన్ సామ్రాజ్యం అధీనంలోకి వచ్చింది. ఈ కాలంలో కొందరు అబ్‌ఖజియన్లు ఇస్లాం మతం అవలంబించారు. |
¤కాకస్ పర్వతాల ప్రాంతంలో రష్యన్ సామ్రాజ్యం విస్తరణ సందర్భంగా రష్యన్ సేనలకూ, కాకస్ తెగలకూ మధ్య పలు సంఘర్షణలు సంభవించాయి. ఏ తెగవారు స్థానికులు, ఎవరు బయటినుండి వచ్చినవారు అన్న విషయాలపై భిన్న అభిప్రాయాలున్నాయి. |
¤1931లో స్టాలిన్ సమయంలో 'సోవియట్ జార్జియా'లో ఒక 'స్వతంత్ర రిపబ్లిక్'గా చేశారు.స్టాలిన్, బెరియాల మరణానంతరం అబ్‌ఖజ్‌ల పట్ల అణచివేత చాలావరకు సడలింది. తక్కిన చిన్న రిపబ్లిక్‌లలాగానే అబ్‌ఖజియన్‌ల సాంస్కృతిక, సాహిత్య పరిరక్షణకు ప్రోత్సాహం లభించింది. |
¤1980 దశకంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరుగుతున్నపుడు అబ్‌ఖజియన్, జార్జియన్ వర్గాల మధ్య విభేదాలు పెచ్చరిల్లాయి. ఈ సందర్భంలో 1989లో సుఖుమిలో జరిగిన హింసాకాండలో 16 మంది జార్జియన్లు మరణించారు. పెద్దపెట్టున అల్లర్లు చెలరేగాయి. సోవియట్ సేనలు కలుగజేసుకొని శాంతిని నెలకొల్పాయి. |
¤1993న తిరుగుబాటు సమయంలో ఆస్తి నష్టం, మరణాలు, అత్యాచారాలు జరిగాయి.10,000-30,000 మంది జార్జియనులు, 3,000 మంది అబ్‌ఖజియనులు మరణించి ఉంటారని,అంచనా. |
¤1992-1993 మధ్యకాలంలో జరిగిన వేర్పాటు ఉద్యమం సాయుధపోరాటంగా పరిణమించింది. ఇందులో జార్జియా మిలిటరీ ఓడిపోయింది. అబ్‌ఖజియా ప్రాంతంనుండి ఇతర జాతులవాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 1994లో యుద్ధవిరమణ జరిగింది. |
¤అబ్‌ఖజియాలో తమ పాలనను అంతర్జాతీయంగా గుర్తించాలని ఆ దేశపు 'పార్లమెంట్' తీర్మానించినప్పటికీ అంతర్జాతీయ సమాజం జార్జియా దేశపు సమైక్యతనే సమర్ధిస్తున్నది. |
¤పశ్చిమాన నల్ల సముద్రం, ఉత్తరాన రష్యా అబ్‌ఖజియాకు సరిహద్దులు. జార్జియా దేశంలోని సమెగ్రెలో-జెమో స్వానెటి ప్రాంతం అబ్‌ఖజియాకు తూర్పున హద్దుగా ఉంది. |
¤మొత్తం 8,600 చ.కి.మీ. వైశాల్యం గల అబ్‌ఖజియా దేశం ప్రధానంగా పర్వతమయమైనది. కాకస్ పర్వతాలలో విస్తరించి ఉన్నది. |
¤కాకస్ పర్వతాలనుండి సముద్రంలోకి ప్రవహించే చిన్న చిన్న నదులు వ్యవసాయానికి ప్రధానమైన నీటివనరులు. వీటిలో కోడోరి, బజిబ్, ఘలిడ్జ్‌గల్, గుమిస్టా ముఖ్యమైన నదులు. |
¤సారవంతమైన అబ్‌ఖజియా భూమిలో తేయాకు, పుగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు, ముఖ్యంగా టాంగరిన్ (కమలా ఫలం వంటివి) బాగా పండుతాయి. |
¤ 3 అక్టోబర్ 2004లో జరిగిన ఎన్నికలలో రష్యనుల అండ ఉన్న రావుల్ ఖజింబా, మరొక ప్రత్యర్ధి సెర్గీ బగాప్ష్‌ల మధ్య పోటీ నెలకొంది. కాని ఇద్దరూ చివరకు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. |
¤ప్రతి గ్రామానికీ, జిల్లాకూ అసెంబ్లీ ప్రతినిధులు ఎన్నుకొనబడుతారు. జిల్లా అసెంబ్లీ ప్రతినిధులలో ఒకరిని జిల్లా ప్రధానాధికారిగా ప్రెసిడెంట్ నియమిస్తడు. 35 మంది ఎన్నుకొనబడిన సభ్యులు గల ప్రజా అసెంబ్లీ ప్రధానమైన చట్టసభ. 2007లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి |
¤అబ్‌ఖజియా జనాభాలో షుమారు 75% ఆర్థొడాక్స్ క్రైస్తవులు, షుమారు 10% సున్నీ ముస్లిములు కొద్ది మంది యూదులు, యెహోవా సాక్షులు ఉన్నారు. |
¤రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలవారికీ సమాన హక్కులు ఉన్నాయి. |
అబ్‌ఖజియా అసలు పేరు : అబ్‌ఖజియన్ రిపబ్లిక్ ప్రభుత్వం |
అబ్‌ఖజియా జాతీయ గీతం : Aiaaira |
అబ్‌ఖజియా వైశాల్యం : 8,600 km² |
అబ్‌ఖజియా జనాభా : 157,000-190,000 |
అబ్‌ఖజియా రాజధాని :
సుఖుమి |
అబ్‌ఖజియా ప్రెసిడెంట్
: సెర్గీ బగప్ష్ |
అబ్‌ఖజియా ప్రధాన మంత్రి : అలెగ్జాండర్ అంక్వబ్ |
జార్జియా దేశం నుండి స్వతంత్రం పొందింది.: ప్రకటించబడింది. 23 జూలై 1992 |
కరెన్సీ : రష్యన్ రూబుల్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment