ఆ దర్గాలో రాత్రివేళల్లో సింహాలు సంచరించేవని, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవట ? ఆ దర్గా ఎక్కడుందో మీకు తెలుసా ?



jahangir peer dargah కోసం చిత్ర ఫలితం

==)  హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా మహబూబ్ నగర్ జిల్లాకొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉంది, ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది.

jahangir peer dargah కోసం చిత్ర ఫలితం
==)  సుమారు 700 సం.ల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినొద్దీన్, బురానొద్దిన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చి కొంత కాలం తరువాత మరణించినారని చెబుతారు. వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా వాడుకలో కొచ్చిందని నమ్ముతారు. 400 సం.ల క్రితం గోలుకొండ కోటపై విజయం సాధించిన రాజులు తరువాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి.
==)   దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరైన సయ్యద్ ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడుగా నియమించి, 4 పరగణాలకు ఖాజీగా కూడా నియుక్తులను చేసారు. 1948 సం. వరకు ఇబ్రాహిం అలీ వారసులు సంరక్షించే వారు. ఆ తరువాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆదీనంలోకి ఈ దర్గా వచ్చింది
lions కోసం చిత్ర ఫలితం

==)  ఈ దర్గా ప్రాంతం పూర్వం అడవిలా ఉండేదని, రాత్రివేళల్లో దర్గా దరిదాపుల్లో ఎవరు సంచరించేవారు కాదని, దర్గాలో రాత్రివేళల్లో సింహాలు సంచరించేవని, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవని ఇక్కడి వారు చెబుతారు. 
==)  ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి పర్వదినాలలో 3 రోజుల పాటు దర్గాలో ఉర్సు ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని ముస్లిమ్‌లే కాకుండా విదేశాలలో ఉండేవారు సైతం వస్తుంటారు. 
==)  దర్గా స్థానంలో పూర్వ కాలంలో నరసింహ స్వామి దేవాలయం ఉండేదని ఇక్కడి హిందువులు భావిస్తారు. అందుకే ఆ విశ్వాసంతోనే హిందువులు కూడా అధిక సంఖ్యలో ఈ దర్గాను సందర్శిస్తుంటారు. 
==)  ఈ దర్గా మతసామరస్యానికి ఓ గొప్ప ప్రతీక. ఇక్కడికి ముస్లిమ్‌లు, హిందువులతో పాటు సిక్కులు కూడా వచ్చి కొలుస్తుంటారు. సమీప ప్రాంతాలలోని లంబాడ కుటుంబాలు కూడా ఎడ్లబండ్లపై ప్రత్యేకంగా వచ్చి కందురులు చేస్తుంటారు, ఈ ప్రాంతంలో సంపన్న కుటుంబాలకు చెందినవారు ఏ మతానికి చెందినవారైనా తమ ఇంటి దేవుడిగా కొలుస్తుంటారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment