ఆ ఊర్లో కడుపులో ఉన్నది "మగ పిల్లాడు" అని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటారు , మగ వారికి పెళ్లి చేయాలంటే కనీసం పది లక్షలు కట్నంగా ఇవ్వాలి ? ఆడపిల్లలని పురిట్లోనే చంపేసే ఈ రోజుల్లో ఒక ఊర్లో విచిత్రం ? మీకు తెలుసా?


kid కోసం చిత్ర ఫలితం
Its  Very  Very  Bad ... 


మధ్యప్రదేశ్‌లోని ‘నోమదిక్’ అనే ఒక తెగ ఉంది.

 ‘నోమదిక్’ తెగకు చెందిన చాలామంది మహిళలు కొడుకు పుట్టడాన్ని ఎంతమాత్రం ఇష్టపడరు. ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడే కొడుకు’ అనే సెంటిమెంట్ వారికి లేదు. కొడుకు పుట్టడం అంటే ‘నరకం’లోకి పోవడం అని కూడా ఆందోళన పడతారు. ఆడపిల్ల పుడితే మాత్రం ఆరోజు పండగ జరుపుకుంటారు.

ఎందుకంటే ?

నోమదిక్ తెగ ప్రధాన వృత్తి వ్యభిచారం. ఆడబిడ్డ పుడితే...భవిష్యత్తులో ఆర్థికంగా ఆదుకుంటుందని, మగబిడ్డ పుడితే ఆదుకోకపోగా భారంగా తయారవుతాడనీ అనుకుంటారు ఈ తెగ వాళ్లు. చిన్న చిన్న గుడారాలలో, రెండు చిన్న గదుల ఇంట్లో వీళ్లు నివాసముంటారు.

 నోమదిక్‌లో ఒక కుటుంబం ఆర్థికస్థాయి అనేది ఆ కుటుంబంలోని మగ,ఆడ సంతానం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది ఆడపిల్లలు ఉన్న ఇంటితో పోల్చితే, ఎక్కువమంది మగపిల్లలు ఉన్నవారి ఆర్థికస్థాయి తక్కువగా ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉంటాయి.

‘‘ఆడపిల్ల పుడితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మగపిల్లవాడైతే...ఉపాధి సంగతి ఎలా ఉన్నా...పెళ్లి చేయడం కూడా కష్టమే. కన్యాశుల్కంగా పది లక్షలు ఇస్తేగానీ ఒక మగవాడి పెళ్లి కాదు’’ 

గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే గర్భస్రావం చేసుకున్న మహిళలు ఎందరో ఈ తెగలో  ఉన్నారు.

ఆడపిల్లల వల్ల తమ ఐశ్వర్యం పెరుగుతుందని ఆలోచిస్తున్నారు తప్ప వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు.

ఇదంతా గతం .... కాని ఈ తరం అమ్మాయిలు అలా కాదు . ఆడపిల్లలు డబ్బులు దాచుకోవడానికి వ్యభిచారంలోకి దిగినా, తమ బిడ్డల్ని మాత్రం దీనిలోకి రానివ్వడం లేదు. జాగ్రత్తగా చదివిస్తున్నారు. ఇలా జాగ్రత్త పడిన కుటుంబాలలో మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు.

‘‘నోమదిక్ తెగలో వ్యభిచారం అనేది  ప్రధాన సమస్య , దీన్ని పరిష్కరిస్తేగానీ వారి జీవితాల్లో కొత్త మార్పు రాదు .   

వారి జీవితాలు మారాలని కోరుకుందాం ?






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment