ఒక సినిమా కోసం రాసిన పాట ఈ రోజు తెలుగు ప్రజలకు అనుకోకుండా " రాష్ట్రగీతము " అయింది ? ఆ సినిమా ఏమిటి ? ఆ గీతం ఏమిటి?



శంకరంబాడి సుందరాచార్యులు 

సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతి లో జన్మించాడు.అతని మాతృభాష తమిళంమదనపల్లె లో ఇంటర్మీడియట్  వరకు చదివాడు.
తండ్రి మందలింపునకు కోపగించి,  ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
పూట గడవడం కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ

సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీబిల్హణీయందీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. . .  కూడా ఆయన రచించినదే . 

సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు.
కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు.

 టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది,
జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటుపడ్డాడు.

సుందరాచారి 
1977 ఏప్రిల్ 8
 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.

    కాని ఆయన ఒక సినిమా కోసం రాసిన పాట ఈ రోజు తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి
రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ గా అందించాడు.


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి            || మా|| 
గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి              ||మా||
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
 రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం  నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ !  జై తెలుగు తల్లీ ! 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment