భారత అంతరిక్ష రంగంలో విజయాలు






భారత అంతరిక్ష రంగంలో విజయాలు 

1962 - భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు.

1965 - తుంబాలో స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు.

1969 - ఆగస్ట్ 15న ఇస్రో ఏర్పాటైంది. అప్పుడు అణుశక్తి విభాగం కింద ఉండేది.

1971 - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ కేంద్రం ఏర్పాటైంది.

1972 - డిపార్‌‌టమెంట్ ఆఫ్ స్పేస్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను అంతరిక్ష విభాగం కిందకు తీసుకువచ్చారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

1975 - భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19న రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు.

1979 - భాస్కర -1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

1980 - శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

1981 - జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. అఞఞ్ఛ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పెరిమెంట్.

1981 - భాస్కర -2 ప్రయోగం.

1982 - అమెరికా రాకెట్ ద్వారా ఇన్‌శాట్-1ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం.

1983 - ఇన్‌శాట్ -1 బీ ప్రయోగం.

1984 - రష్యా రాకెట్ సోయూజ్ టీ-11లో రాకేష్‌శర్మ అంతరిక్షయానం.

1987 - విఫలమైన మొదటి ఎస్‌ఎల్‌వీ ప్రయోగం (ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్).

1988 - రష్యా రాకెట్ ద్వారా తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్‌ఎస్-1ఏ ప్రయోగం.

1991 - ఐఆర్‌ఎస్-1బీ ప్రయోగం.

1992 - ఇన్‌శాట్ -2ఏ ప్రయోగం.

1993 - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది.

1994 - పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

1995 - ఇన్‌శాట్ -2సీ, ఐఆర్‌ఎస్-1సీ ప్రయోగం.

1996 - పీఎస్‌ఎల్‌వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్‌ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

1997 - ఐఆర్‌ఎస్-1డీ ప్రయోగం.

1999 - ఓషన్ శాట్‌తోపాటు విదేశీ శాటిలైట్లను కూడా తొలిసారి ప్రయోగించారు. కొరియా, జర్మనీలకు చెందిన శాటిలైట్లను ప్రయోగించారు.

2000 - ఇన్‌శాట్-3బీ ప్రయోగం.

2001- జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జిఎస్‌ఎల్‌వీ) రాకెట్ ద్వారా జీశాట్-1 శాటిలైట్‌ను ప్రయోగించారు.

2002 - వాతావరణ ఉపగ్రహం కల్పన-1ను ప్రయోగించారు. దీని మొదటి పేరు మెట్‌శాట్-1.

2003 - జీశాట్-2ను, రిసోర్‌‌సశాట్-1ను ప్రయోగించారు.

 2004 - విద్యాసేవలకై ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

2005 - మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ6 ద్వారా ప్రయోగించారు.

 2005 - ఇన్‌శాట్-4ఏ ప్రయోగం.

2007 - కార్టోశాట్-2, ఇన్‌శాట్-4సీఆర్‌ను ప్రయోగించారు.

2008 - పీఎస్‌ఎల్‌వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి.

2008 - పీఎస్‌ఎల్‌వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు.

2009 - పీఎస్‌ఎల్‌వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు.

2010-పీఎస్‌ఎల్‌వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.

2011-పీఎస్‌ఎల్‌వీ-సీ16 ద్వారా రిసోర్‌‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్స్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు.

2012-ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్‌ఎల్‌వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం.

2013-పీఎస్‌ఎల్‌వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. అవి.. 
ఆస్ట్రియాకు చెందిన యూనిబ్రైట్, బ్రైట్; డెన్మార్‌‌కకు చెందిన అవ్‌శాట్-3, యూకేకు చెందిన స్ట్రాండ్, కెనడా కు చెందిన నియోశాట్, సాఫైర్.

2013-పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఈ ఏడాది జూలై1న ప్రయోగించారు.

 2013-ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి ఈ ఏడాది జూలై 26న భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీని విజయవంతంగా ప్రయోగించారు.

2013 - ఈ ఏడాది నవంబర్‌లో మార్‌‌స ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
 చంద్రయాన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబర్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఇది 312 రోజులు పనిచేసి 2009, ఆగస్టు 29న ఆగిపోయింది. చంద్రయాన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. త్వరలో చంద్రయాన్-2ను కూడా ప్రయోగిస్తారు.
పరిశోధనా సంస్థలు - వాటి విధులు
1.ఇస్రో - బెంగళూరు

2.ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ - అహ్మదాబాద్: ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం.

3.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం.

4.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం.

5.తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్‌లను ప్రయోగించే ప్రదేశం.

6.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు.

7.మాస్టర్ కంట్రోల్ కేంద్రం - భోపాల్ (మధ్యప్రదేశ్), హసన్ (కర్ణాటక).

8.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ - తిరువనంతపురం: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కోర్సులను నిర్వహిస్తోంది.

9.ఆంట్రిక్స్ కార్పొరేషన్-బెంగళూరు: ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానం, సేవలను మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేశారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment