స్వచ్ఛమైన లోహాన్ని వెలికితీసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ? - మీకు తెలుసా ?






లోహశాస్త్రం
metal technology కోసం చిత్ర ఫలితం

స్వచ్ఛమైన లోహాన్ని వెలికితీసే పద్ధతి చేసే ప్రక్రియల గురించి చర్చించేదే లోహశాస్త్రం.


ప్రకృతిలో లోహం లభించే వివిధ సమ్మేళనాలనే ‘ఖనిజాలు’ అంటారు. ఖనిజాలన్నింటిలో దేని నుంచి వ్యాపారాత్మకంగా లాభదాయకమైన పద్ధతిలో లోహాన్ని వెలికి తీయగలమో దాన్ని ‘ధాతువు’ అంటారు. అంటే ఖనిజాలన్నీ ధాతువులు కావు. ఉదాహరణకు అల్యూమినియం ఖనిజాలు - కోరండం, బాక్సైట్, క్రయొలైట్. వీటిలో బాక్సైట్ నుంచి మాత్రమే వ్యాపార సరళిలో అల్యూమినియం లోహాన్ని ఉత్పత్తి చేస్తారు. కాబట్టి అల్యూమినియం ధాతువు బాక్సైట్. ధాతువులో ఉండే మలినాలను ‘గాంగ్’ లేదా ‘మాట్రిక్స్’ అంటారు.
     
* ధాతువును గాలి లేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని భస్మీకరణం (Calcination) అంటారు. ఉదాహరణకు లైమ్‌స్టోన్ ను వేడిచేస్తే విఘటనం చెందిCo2  విడుదల చేస్తూ కాల్షియం ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.

* ధాతువును గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయడాన్ని భర్జనం (Roasting) అంటారు.

* సాధారణంగా ధాతువు అనేది లోహం మాత్రమే కాకుండా రాళ్లు, ఇసుక, బంకమన్ను, మైకా, క్వార్‌‌ట మొదలైన మలినాలతో కలిసి ఉంటుంది.

* ఒక ధాతువును ద్రవకారి (ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గించేది)ని కలిపి లేదా కలపకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా లేదా సల్ఫైడ్ ఖనిజాన్ని ద్రవస్థితిలో పొందడాన్ని ‘ప్రగలనం’ అంటారు.

* శుద్ధలోహం కంటే మిశ్రమలోహం ఉపయోగకర గుణాలు అధికం. ఉదాహరణకు స్వచ్ఛమైన బంగారానికి కొద్దిగా రాగిని కలిపితే దాని గట్టితనం పెరుగుతుంది.





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment