మనం పాదరసాన్ని తాకినా, బట్టమీద పోసినా, నేలమీద పోసినా అంటుకోదు. మరి బంగారానికి పాదరాసాన్ని తాకిస్తే ? - మీకు తెలుసా ?




mercury in water కోసం చిత్ర ఫలితం


>>  నీరు, పెట్రోలు, కిరోసిన్‌, బెంజీన్‌ వంటి ద్రవాలు సంయోగ పదార్థాలు. పాదరసం ఓ మూలకం . నీరు, బెంజీన్‌లు స్వచ్ఛమైన సంయోగ పదార్థాలు. నీటిలో న2ఉ అనే అణువుల కోట్లాదిగా ఉంటాయి. 

>>  ప్రతి 18 గ్రాముల నీటిలో ఆక్సిజన్‌ 16 గ్రాములు, హైడ్రోజన్‌ 2 గ్రాములు ఉంటాయి. ప్రతి న2ఉ అణువులోనిన (హైడ్రోజన్‌) భాగం పక్కనే ఉన్న అణువుల్లోని  (ఆక్సిజన్‌) భాగంతో బలహీనమైన సంధానాన్ని ఏర్పర్చుకొంటుంది. 
పాదరసం కోసం చిత్ర ఫలితం
>>  అలాగే ప్రతి  అణువుల్లోని భాగాలతో సంధానాన్ని ఏర్పర్చుకొంటాయి. ఇలా  అణువుల మధ్య నల గుండా ఏర్పడే బలహీనమైన బంధాన్ని ''హైడ్రోజన్‌ బంధాలు  అంటారు. ఈ హైడ్రోజన్‌ బంధాల వల్లనే నీరు మామూలు ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర వాయుస్థితిలో ఉండాల్సిన బదులు ద్రవస్థితిలో ఉంది. 

>>  మన చేతులు, చర్మంలో కూడా రసాయనిక సమూహాలున్న ప్రోటీన్లు, గైకోప్రొటీన్లు ఉంటాయి. ఈ సమూహాలతో నీరు హైడ్రోజన్‌ బంధాలను ఏర్పర్చడం వల్ల నీరు మన చర్మానికి, చేతికి అంటుకొంటుంది. బట్టలు కూడా చాలామటుకు సెల్యులోజ్‌ అనే నారలాంటి పదార్థ నిర్మితాలు. 

>>  ఇందులో కూడా ఉన భాగాలు విచ్చలవిడిగా ఉంటాయి. కాబట్టి నీరు బాగా అంటుకొంటుంది. కిరోసిన్‌, బెంజీన్‌, పెట్రోలు వంటి ద్రవాల్లో ఉన భాగాలు లేకున్నా, హైడ్రోజన్‌ బంధాలకు అంతగా అనువుగా లేకున్నా మన చర్మంలోను, బట్టలలోను  బంధాలున్న భాగాలు, ఆ ద్రవాల్లో ఉన్న జన భాగాల మధ్య చాలా తేలికపాటి విద్యుదయస్కాంత ఆకర్షణ బలాలు ఏర్పడతాయి. 

>>  వీటినే వేండర్‌ వాల్‌ బలాలు అంటారు. ఈ వేండర్‌ వాల్‌ బలాల మూలాన ఆ ద్రవాలు కూడా చర్మానికి, చేతులకు, బట్టలకు అంటుకొంటాయి. కానీ పాదరసంలో కేవలం  పరమాణువులే పదార్థం మొత్తం వ్యాపించి ఉంటాయి. ప్రతి  పరమాణువు మరో పరమాణువుతో చాలా వైపులకు లోహబంధాన్ని ఏర్పరు స్తుంది. 

>>  ఈ విధమైన లోహ బంధాలు బంగారం, రాగి, ఇనుము వంటి మూలకాలలో ఉన్నా, అవి పాదరసంలోకన్నా బలమైనవిగా ఉండడం వల్ల ఆ లోహాలు ఘనస్థితి  లో ఉంటున్నాయి. కానీ పాదరసంలో కూడా  బంధాలు బంగారమంత కాకపోయినా బలానికి తీసిపోవు. అందువల్లే పాదరసం ద్రవమే అయినా అది చాలా ఉష్ణోగ్రత వరకూ ఆవిరి కాకుండా ద్రవస్థితిని నిలుపుకోగలదు.
          
>>  మొత్తమ్మీద అసలు విషయమేమిటంటే పాదరసంలోని పరమాణువులు కోట్లాదిగా పదార్థం యావత్తూ సమాకలన రీతిలో బహు దిశల్లో, బహుళంగా లోహబంధాన్ని ఏర్పరుస్తాయి. తద్వారా ప్రతి నస్త్ర పరమాణువు దాదాపు స్థిరంగా,ఉంది. 

>>  అంటే ఇక ఏ నస్త్ర పరమాణువుకు మరే ఇతర బంధాన్ని ఏర్పర్చాల్సిన అవసరంగానీ, అగత్యంగానీ లేదన్నమాట. కాబట్టి మనం పాదరసాన్ని తాకినా, బట్టమీద పోసినా, నేలమీద పోసినా అంటుకోదు. 

>>  అంటుకోవడం అంటేనే ఆయా ద్రవంలోని అణువుల లేదా పరమాణువులు అంటుకొనే ఆ పదార్థపు ఉపరితలంలోని పరమాణువులు లేదా అణువుల మధ్య తేలికపాటి బంధాల్ని ఏర్పర్చడమే. ఆ అవసరం, సదుపాయం, అవకాశం నీరు తదితర ద్రవాలకు ఉందిగానీ పాదరసానికి లేదు. 

>>  పాదరసం మన చేతులకి అంటుకోకపోయినా లోహ ఉపరితలాలకు బాగా అంటుకొంటుంది. నిజానికి ఆ లోహాలు పాదరసంలో కరిగిపోతాయి. 

బంగారాన్ని పాదరసానికి తాకించకండి. 

అలాచేశారో ఇక ఆ బంగారాన్ని దాదాపు పోగొట్టుకొన్నట్టే





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment