జావా (JAVA) గురించి తెలుసుకుందాం - కంప్యూటర్ టిప్స్

జావా 
java software download here కోసం చిత్ర ఫలితం


జావా అనే పదం ఎక్కువగా విద్యార్దుల నోటి వెంట వినిపిస్తుంది.  సాదారణ పిసి యూజర్లు నుండి ప్రొఫెషనల్స వరకు ఎంతో మంది దీనిని  ఉపయోగిస్తున్న దీని అసలు శక్తి ఏమిటో తెలిసిన వారు తక్కువనే చెప్పాలి.  అందుకే జావా ప్రాదాన్యత సాదారణ పిసి యుజర్లుకు అర్ధం అయ్యేలా తెలియజెప్పడం కోసం ఈ ఆర్టికల్ వ్రాయడం జరిగింది.  అసలు మన బ్లాగ్ లక్షం సాధారణ పిసి యుసర్స్ కు IT రంగంలో తెలియని ఎన్నో విషయాలు వారికీ అర్ధమయ్యే రీతిలో సాధారణ భాష లో తెలియ చెప్పడం.  దీనిని అర్ధం చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.....
సెల్ ఫోన్లు, డివిడి ప్లేయర్లు, మొబైల్ అప్లికేషన్లు, వెబ్ బ్రౌజరు లు , ఆన్ లైన్ అప్లికేషన్లు, google maps వంటి అన్ని రకాల ప్రదేశాలలో జావా విస్తరించి ఉంది.  Sun Microsystem సంస్థ 1995 లో  ఈ జావా ప్రోగ్రాం లాంగ్వేజ్  నీ అభివృద్ధి చేయడం జరిగింది.  ఈ రోజు ఇంటర్నెట్ ఇంతగా విస్తరించడానికి జావా పాత్ర ఎంతో విలువ అయినది.
జావా విండోస్ సిస్టం లో ఎంత మెరుగ్గా పని చేస్తుందో లినక్సు, యునిక్స్, ఆపిల్ సిస్టం లోను అంతే శక్తి వంతంగా పని చేస్తుంది.  ఒక్కో ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకంగా కోడ్ రాయలిసిన పని లేదు.  జావా లో  రాయబడిన ఒక అప్లికేషను (వీటినే applet లు అంటారు) ఉన్నది ఉన్నట్లుJava Runtime Enviroment (JRE) ఆధారంగా అన్ని ఆపరేటింగ్ సిస్టం లు,
Platform లలోను పని చేస్తుంది.  ఎలాంటి పరిమితులు, ఇబ్బందులు తలెత్తవు.  ఈ సౌలబ్యం వలెనే అధిక శాతం మంది ప్రోగ్రామర్లు గత పదేళ్లుగా ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కన్నా జావా నేర్చుకోవడం ఫై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వచ్చారు.  ఆలాగే వివిధ వివిధ పోర్టబుల్ Device లోను జావా వాడబడుతూ వస్తుంది.  ఉదా. కు., మనం రోజు వాడే మొబైల్ ఫోన్లలనే తీసుకోండి.  .JAR, .JAD  ఎక్స్టెన్షన్ నేమ్ లతో అనేక  అప్లికేషనులు అన్ లైన్ లో లభ్య మావ్తున్నాయి.  దీనికి కారణం జావా ప్రోగ్రాం రన్ కావడానికి తగిన Environment ఉంటె జావా ఎక్కడైనా చక్కగా పని చేస్తుంది.  అందుకే దీనిని Platform Indipendent అని అంటారు.
మనం రోజు ఉపయోగించే అనేక వెబ్ సైటులు పూర్తిగా గా గాని పాక్షికంగా గాని, కొంత కోడ్ రూపంలో గాని, జావా ఉపయోగిస్తున్నారు.  ఒక వెబ్ సైట్ లో పొందుపరిఛి బడి ఉన్న జావా కోడ్ నీ మనం వాడేInternet Explorer, Firefox, Chrome, Opera వంటి బ్రౌజరు స్వీకరించి, దాన్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడి ఉండే Java Runtime Environment (JRE) కి అందిస్తుంది.  ఆ రన్ టైం ఎన్విరాన్మెంట్ మన కంప్యూటర్ కి ఎలాంటి హాని చేయని sandbox తరహ వాతావరణంలో ఆ కోడ్ నీ/అప్లికేషన్ నీ రన్ చేసి దాని యొక్క ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది.  ఇక్కడ మనం యునిక్స్, లినక్సు, విండోస్, మాక్ వంటి ఏ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న జావా ద్వారా ప్రయోజనం పొందడానికి కావలిసింది కేవలం JRE

JAVA SOFTWARE FREE DOWNLOAD 

CLICK THIS SYMBOL  
java software download here కోసం చిత్ర ఫలితం


జావా  బుక్స్ కొరకు  Click Here

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment