బ్రెజిల్
==) బ్రెజిల్ పూర్తి పేరు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ , దక్షిణ అమెరికాలోని ఒక దేశము.వైశాల్యం రీత్యా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశం జనాభా లెక్కల రీత్యా కూడా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశమైన బ్రెజిల్, నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. |
==) క్రి పు 1500 లో పెడ్రో అల్వారెజ్ బ్రెజిలియన్ తీరాన్ని కనుగొన్నాడు. |
==) 1500 సంవత్సరము నుండి 1822లో స్వాతంత్ర్యము పొందేవరకు బ్రెజిల్ పోర్చుగల్ పరిపాలనలో ఉంది |
==) బ్రెజిలియన్ జెండాను బ్రెజిలియన్ రాయల్ హౌస్ యొక్క ప్రతీక అంటారు దీనిలో ఆకుపచ్చ నేపథ్యం ఒక పెద్ద పసుపు వజ్రం ఉంది. బ్రెజిల్ యొక్క మొదటి చక్రవర్తి సొంతమైన బ్రగాంజా రాయల్ హౌస్ ను ఇది సూచిస్తుంది. |
==) బ్రెజిల్‌లో సాకర్‌కు ఎంత ఆదరణ ఉందో అంతకు మించి ‘కార్నివాల్’కు క్రేజ్ ఉంది. ఈస్టర్‌కు 46 రోజుల ముందు నుంచి జరిగే ఈ ఉత్సవంలో వయసుతో తేడా లేకుండా చిన్నాపెద్దా అంతా కలిసి రకరకాల దుస్తులు, విచిత్ర వేషధారణలతో, ప్రత్యేక నృత్యాలతో అలరిస్తారు. రోమన్ కాథలిక్కులు అనాదిగా ఆచరిస్తున్న ‘కామెలెవర్’ పదానికి రూపాంతరమే ‘కార్నికాల్’. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి నృత్యాలు చేయడం బ్రెజిల్ ప్రజలు కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయం. అదే బ్రెజిల్ కార్నివాల్.
==) చెడుకు స్వస్తిచెప్పి, మంచిని ఆహ్వానించే పండుగే ‘పగాన్’. భిన్న సంస్కృతులు, ఆచార విధానాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్నివాల్‌ను బ్రెజిల్‌లోని రియో డి జెనీరో, సావో పౌలో నగరాలు ఘనంగా నిర్వహిస్తాయి.
==) ఈ ఉత్సవాల్లో మహిళలు వేసుకునే దుస్తులు అసభ్యకరంగా ఉంటాయని, నృత్యాలు కూడా అదేస్థాయిలో అసహ్యంగా ఉంటాయని విమర్శలు ఉన్నప్పటికీ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ప్రజలు బ్రెజిల్ కార్నివాల్‌ను టీవీల్లో చూసి ఆనందిస్తారు.
|
బ్రెజిల్ పూర్తి పేరు : ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ |
బ్రెజిల్ నినాదం "Ordem e Progresso" (Portuguese) |
బ్రెజిల్ జాతీయ గీతం : Hino Nacional Brasileiro |
జాతీయ చిహ్నము : Selo Nacional do Brasil |
రాజధాని : బ్రెజిలియా |
అధికార భాషలు : పోర్చుగీసు |
ప్రభుత్వము : Federal presidential constitutional republic |
President :
constitutional republic |
Vice President : Michel Temer |
President of the Chamber of Deputies :
Henrique Eduardo Alves |
President of the
Senate : Renan Calheiros |
President of the Supreme Federal Court : Joaquim Barbosa |
స్వాతంత్ర్యం : 7 సెప్టెంబరు 1822 |
వైశాల్యం : 85,15,767 km2 |
జనాబా : 193,946,886 |
జీడీపీ : $2.356 trillion |
బ్రెజిల్ కరెన్సీ : Real
(R$) (BRL) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment