పోర్చుగల్
అసలు పేరు పోర్చుగీస్ రిపబ్లిక్. దీనికి లిస్బన్ రాజధాని. ఐరోపాలోని ఐబీరియా ద్వీపకల్పంలోని ఒక దేశం.
|
ఐరోపాలో
ఉన్న పోర్చుగల్ అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు, ఉత్తర దిశలలో, స్పెయిన్కు
పశ్చిమ, దక్షిణ దిశలలో ఉంది. |
15వ
శతాబ్దంలో ఈ దేశాన్ని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసింది
ప్రిన్స్‌హెన్రీ.
వాస్కోడిగామా
తన సముద్ర ప్రయాణం ఈ దేశం నుండే ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన భారతదేశం
వచ్చారు.
1999
వరకు ఈ దేశాన్ని పోర్చుగీసు రాజు కుటుంబం దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించింది.
క్రీ.శ.1139లోనే
ఈ దేశంలో రాజరిక వ్యవ స్థ ప్రారంభమైంది. అయితే 1910 అక్టోబర్ 5న దేశాన్ని ఒక
గణతంత్ర దేశంగా ప్రకటించారు |
|
క్రీస్తు
పూర్వం 219 లో రోమన్లు పాలించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ
దేశాన్ని ఆక్రమించుకున్నారు. 6వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ దేశాన్ని
పాలించారు. 10వ శతాబ్దంలో దేశం అంతా బదాజోజ్ తైఫ్రా అనే ముస్లిం రాజుల వశమైంది.
అయితే 11వ శతాబ్దం ప్రారంభంలో అల్మోరా విన్‌లు దేశాన్ని తమ వశం చేసుకున్నారు.
కాలక్రమంలో ముస్లింలను ఈ దేశం నుండి పారదోలారు.
|
|
|
|
|
వీరి
ఆహారం ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది . దేశం ఉత్తర భాగంలో ఉండేవారు తినే
ఆహారాన్ని ‘కాల్డోవైర్డ్’ అంటారు.
మొక్కజొన్న పిండితో, గోధుమ పిండితో చేసిన బ్రెడ్డు సాధారణంగా తింటారు.
బంగాళ దుంపలతో సూప్ తయారు చేస్తారు. వీళ్లు పంది మాంసం ఎక్కువగా తింటారు.
దక్షిణభాగ ప్రజలు వరి అన్నం, రొట్టెలు, పందిమాంసం, బంగాళ దుంపలు ద్రాక్ష సారాయి
ఇలా అనేక వంటకాలను తయారు చేస్తాయి. ఇక్కడి ప్రజలు అతిథులకు ఎక్కువ ఆదరిస్తారు.
గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎక్కువగా నల్లని దుస్తులు ధరిస్తారు. మగవాళ్లు కూడా
నల్లని షర్టులు ధరిస్తారు. |
|
పరిపాలనా
సౌలభ్యం కోసం దేశాన్ని 308 మున్సిపాలిటీలుగా విభజించారు. దేశంలో 18 జిల్లాలు,
ఏడు రీజియన్లు ఉన్నాయి. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు ఏడు ఉన్నాయి. అవి
లిస్బన్, పోర్టో విలానోవాడి గాయియా, అమడోరా, బ్రాగా, పుంచల్, కోయింబ్రా,
సేటుబల్, అల్మాడాలు వీటిలో లిస్బన్, పోర్టో నగరాలు మెట్రో నగరాలుగా చలామణి
అవుతున్నాయి. |
|
దేశానికి
ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరూ ఉంటారు. ఇద్దరికీ దేశ పరిపాలన మీద సమాన హక్కులు
ఉంటాయి. అయితే రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. |
|
నబారో నది ఒడ్డున నిర్మితమైన శతాబ్దాల క్రితం నాటి నగరం తోమార్.
12వ శతాబ్దంలో నిర్మించిన ఈ నగరంలో క్రీస్తు కాన్వెంట్ భవనాన్ని యునెస్కో సంస్థ
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. |
|
సావో
ఫ్రాన్సిస్కో మ్యూజియంలో 104 దేశాల నుండి సేకరించిన 43 వేల అగ్గిపెట్టెల రకాలు
ఉన్నాయి. |
|
13వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుత కళా ఖండాల
సముదాయం బతాల్హా నగరం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
1388లో మొదటి జావోరాజు నిర్మించిన ఈ రాజప్రాసాదం ఈ నాటికీ గొప్ప కట్టడంగా నిలిచి
ఉంది. పర్యాటకులను ఆశ్చర్యానందాలకు గురిచేసే ఈ భవన నిర్మాణ శైలి అత్యద్భుతం.
ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ భవన ముఖద్వారమే 15 మీటర్ల ఎత్తు ఉందంటే ఇక ఆ భవనం
ఎంత ఎత్తు, ఎంత అద్భుతంగా ఉంటుందో |
|
|
పోర్చుగల్
జనాబా విషయంలో ప్రపంచంలో 77 వ స్థానం లోను,
జిడిపి లో ప్రపంచమో 43 వ స్థానం లోను ఉంది . |
పోర్చుగల్ ఐక్య రాజ్య సమితి, ఐరొపా సమాఖ్య, నాటో, ఓఈసీడీలలో 1955 నుండి సభ్యదేశంగా ఉంది.
|
|
|
పోర్చుగల్ అసలు పేరు :
పోర్చుగీస్ రిపబ్లిక్ |
|
పోర్చుగల్ జాతీయగీతం
: "ఎ పోర్చుగీసా" |
|
పోర్చుగల్ రాజధాని : లిస్బన్ |
|
పోర్చుగల్ అధికార భాషలు :
పోర్చుగీస్ |
|
పోర్చుగల్ జాతులు
: 95.9% పోర్చుగీస్, 4.1%
(బ్రెజీలియన్లు, కేప్‌వెర్డియన్లు, అంగోలా, ఇతర మైనారిటీలు) |
|
పోర్చుగల్ ప్రభుత్వం
: పార్లమెంటరీ రిపబ్లిక్
|
|
పోర్చుగల్ అధ్యక్షుడు
: అనిబాల్ కవాకో సిల్వా
|
|
పోర్చుగల్ ప్రధానమంత్రి :
జోసె సోక్రటీస్ |
|
పోర్చుగల్ అసెంబ్లీ అధ్యక్షుడు :
జైమా గామా |
|
పోర్చుగల్ స్వాతంత్ర్యం : |
Conventional
date for Independence is 1139
స్థాపన 868 పునస్థాపన 1095 డీ ఫ్యాక్టో సార్వభౌమ 24 June 1128
సామ్రాజ్యం 25 జూలై 1139 Recognized 5 October 1143
Papal Recognition 1179
Accession to the European Union 1 జనవరి 1986
|
|
పోర్చుగల్ జనాభా
: 2007 అంచనా 10,617,575 |
|
పోర్చుగల్
జీడీపీ : మొత్తం $230.834 billion |
|
పోర్చుగల్
కరెన్సీ : యూరో (€)² (EUR)
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment