విద్యుత్ చేప (Electric Fish)



electric fish కోసం చిత్ర ఫలితం



విద్యుత్ చేప అసలు పేరు ఈల్ చేప . ఇది శరీరం నుండి దాదాపు 650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదలచేయడం వీటి ప్రత్యేకత.
ఎలక్ట్రిక్‌ 'ఈవ్‌' అనే చేప ఆహార సంపాదనకోసం కరెంట్‌ను ఉత్పత్తి చేసి చేరువలోకి చిన్న చేపలు వచ్చినపుడు, కప్పలు వచ్చినపుడు వాటికి కరంట్‌ షాక్‌లు ఇచ్చి చంపేస్తుంది. ఆ తరువాత వాటిని తింటుంది.
ఎలక్ట్రిక్‌ 'ఈవ్‌' తన శరీరంలోకి ఉత్పత్తి చేసిన కరెంట్‌నంతా ఒకసారి వాడేసిందంటే మళ్ళీ ఒక గంటలో శరీరంలో కరెంట్‌ను తయారు చేసుకోగలదు.
ఎలక్ట్రిక్ ఈల్ శరీరం నుంచి సుమారు 650 వోల్టుల విద్యుత్‌ను విడుదల చేస్తుంది. ఈ కరెంట్ ప్రభావంతో గుర్రం లాంటి జంతువులు సైతం కింద పడి గిలగిల కొట్టుకుంటాయి
electric fish కోసం చిత్ర ఫలితం
ఎక్కువగా మట్టి నీళ్లలో ఉండే ఇవి పది నిమిషాలకోసారి బయటకొస్తాయి.
పూర్వం మానసిక ఆందోళన వల్ల మతిచలించిన వారికి వైద్యం కోసం ఇప్పుడున్న ఎలక్ట్రికల్ ట్రీట్ మెంట్  ఆ కాలం లో ఉండేది కాదు . 
 క్రీ.శ. 45లో 'లార్గెస్‌' అనే వైద్యుడు కరెంట్‌ షాక్‌ ఇచ్చి రోగికి స్వస్థత చేకూర్చే పద్ధతికి ఆద్యుడు 
ఈ వైద్యుడు సముద్రంలో దొరికే ఒక రకం చేపను రోగి నుదట ఉంచేవాడు.ఆ చేప వంద నుండి నూటయాభై వోల్టుల విద్యుత్‌ను విడుదల చేయడంతో రోగి కరెంట్‌షాక్‌కు గురయ్యేవాడు. మానసిక ఆందోళనల వల్ల వచ్చే తలనొప్పి తగ్గడానికి ఈ చికిత్స బాగా ఉపకరించేది
ఎలక్ట్రిక్‌ 'ఈవ్‌' తన శరీరంలోకి ఉత్పత్తి చేసిన కరెంట్‌నంతా ఒకసారి వాడేసిందంటే మళ్ళీ ఒక గంటలో శరీరంలో కరెంట్‌ను తయారు చేసుకోగలదు.
మానసిక వ్యాధులకు కరెంటుషాక్‌లతో చికిత్స చేయడం 1938 నుండిప్రారంభమయ్యింది.
సుమారు ఎనిమిదడుగుల పొడవు ఎదిగే ఈల్ చేపల్లో మూడు రకాల వోల్టేజీ ఆర్గాన్స్ ఉంటాయి.
electric fish కోసం చిత్ర ఫలితం
మొదటి రెండు అవయవాలు తక్కువ వోల్టేజీని ప్రసరిస్తూ పరిసరాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏ శత్రుజీవి అయినా దాడికి వచ్చినప్పుడు ఇవి దీన్ని ఉపయోగిస్తాయి.
పెద్ద ఎలక్ట్రిక్ ఈల్స్ 12 బల్బులు వెలగడానికి సరిపోయేంత విద్యుత్‌ను విడుదల చేస్తాయి.
ఈ చేపల్లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.1 వోల్టేజి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
కొన్ని ఎలక్ట్రిక్ ఈల్స్ 50 కార్లను స్టార్ట్ చేసే విద్యుత్‌ను పుట్టించగలవు.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment