-క్రీ.శ. 1900లో జర్మనీకి చెందిన శాస్త్రవేత్త మాక్స్‌ఫ్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అప్పటినుంచి భౌతికశాస్త్రంలో వస్తున్న అభివృద్ధిని ఆధునిక భౌతికశాస్త్రం అంటున్నారు.
మ్యాక్స్‌ఫ్లాంక్‌కు 1918లో నోబెల్ బహుమతి లభించింది.
-ఐన్‌స్టీన్ (జర్మనీ) ప్రతిపాదించిన కాంతి విద్యుత్ ఫలితం, సాపేక్ష సిద్ధాంతం, ద్రవ్యరాశి-శక్తి తుల్యతానియమం వంటి (E = mc2) నియమాలకు ఆధునిక భౌతికశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. కాంతి విద్యుత్ ఫలితాన్ని కనుగొన్నందుకు 1921లో ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి లభించింది.
-పరమాణు కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త రూథర్‌ఫర్డ్. ఆయన్ను కేంద్రక భౌతికశాస్త్ర పితామహుడు అంటారు. పరమాణు కేంద్రక వ్యాసార్ధాన్ని ఫెర్మీల్లో కొలుస్తారు.
1 ఫెర్మీ = 10-13cm (or) 10-15m
-పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల వంటి కణాలు అమర్చబడి ఉంటాయి. ఎలక్ట్రాన్లు మాత్రం కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
-పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ కణాన్ని గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ప్రోటాన్‌కు ధనావేశం ఉంటుంది. దీని ద్రవ్యరాశి విలువ mp = 1.66 x 10-24 గ్రా. (or) 1.0078 a.m.u (a.m.u - atomic mass unit)
-1932లో బ్రిటన్‌కు చెందిన జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ కణాన్ని కనుగొన్నాడు. దీనికి చాడ్విక్‌కు 1935లో నోబెల్ బహుమతి లభించింది.
-న్యూట్రాన్ ద్రవ్యరాశి mn = 1.67 x 10-24 గ్రా. (or) 1.0087 a.m.u
-J.J థామ్సన్ అనే శాస్త్రవేత్త ఉత్సర్గనాళాన్ని ఉపయోగించి క్యాథోడ్ కిరణాలను కనుగొన్నాడు. క్యాథోడ్ కిరణాలు ఉత్సర్గనాళంలో 0.01 mm Hg పీడనం వద్ద ఉత్పత్తి అవుతాయి. కాథోడ్ కిరణాలకు GJ స్టోనీ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ అని పేరుపెట్టాడు.