నడవలేని వారికి నడక నేర్పిన జైపూర్ ఫుట్ (Jaipur Foot) సృష్టికర్త ఎవరు ? - మీకు తెలుసా ?

pramod karan sethi కోసం చిత్ర ఫలితం

 కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత  కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ
ఈయన  నవంబరు 28, 1927  ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు
ఎముకల వైద్య నిపుణుడైన సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే మెరుపు ఆలోచన వచ్చింది రామచంద్రారావుకే
జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. కాబట్టి సేథీ రబ్బరు, చెక్క మరియు అల్యూమినియంతో దీని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చినాడు. 
jaipur foot కోసం చిత్ర ఫలితం
అయిననూ 1975 వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నవారు కొద్దిమందే. అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత జైపూర్ ఫుట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుట్‌లను అమర్చినది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా జైపూర్ ఫుట్ లనే అమర్చుకున్నారు. ప్రముఖ నటిసుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్‌నే అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.

jaipur foot కోసం చిత్ర ఫలితం
ప్రమోద్ కరణ్ సేథీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారంతో సత్కరించగా, అత్యధికులకు కృత్రిమ అవయవం అమర్చినందులకు సేథీ పేరునే గిన్నిస్ బుక్ వారు రికార్డు చేశారు
 1981లోసామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతోసత్కరించింది. 

jaipur foot కోసం చిత్ర ఫలితం
పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008జనవరి 7న జైపూర్ లో మరణించారు.

1 వ్యాఖ్యలు:

  1. అటువంటి మహానుభావుడికి "పద్మశ్రీ" తో సరిపెట్టారా, అంతేనా? మొహానికి రంగులేసుకుని సినిమాల్లో నటించేవారి పాటి చెయ్యలేదా ఈ డాక్టర్ గారు?

    ReplyDelete

Thank You for your Comment