మంగోలియా
| --> మంగోలియా ఇది తూర్పుఆసియా మరియు మధ్యాసియాలో వున్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలున్నాయి. దీని దక్షిణాగ్రాన కొద్ది మైళ్ళ దూరంలో కజకస్తాన్ సరిహద్దు కలదు. |
| --> మంగోలియా జనాబా పరంగా ప్రపంచంలో 139వ స్తానములో ఉన్నది |
| --> మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంఘీజ్ ఖాన్. |
| --> క్రీ.శ. 1162 - 1227 –1227 మధ్య కాలం లో చెంఘీజ్ ఖాన్ మంగోలియా పరిపాలకుడు గా ఉన్నారు . |
| --> ఈయనను 'ఖాగన్' లేదా ఖాఖాన్ అని కూడా పిలుస్తారు . |
| --> ఆయన పునాదివేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యంగా అవతరించింది |
| --> ఈయన ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు. ఈయన అసలు పేరు "టెమూజిన్" అయితే 'చెంఘీజ్ ఖాన్' అని తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇతడు షామనిజం మతానికి చెందిన వాడు. |
| --> ఈశాన్య ఆసియాకు చెందిన అనేక సంచార తెగలను ఐక్యం చేస్తూ ఆయన అధికారంలోకి వచ్చారు. |
| --> జర్మన్ చరిత్రకారులు ఛెంఘిజ్ ఖాన్ ను రాక్షసునిగా, కఠిన శాసనంతో ప్రపంచాన్ని జయించవచ్చు అనే దురభిప్రాయం కలిగిన హిట్లర్ తయారయ్యాడని పేర్కొన్నారు |
| --> ఏది ఏమైనా మంగోలియా ప్రజలు చెంగిజ్ ఖాన్ కు ఒక గుర్రపు విగ్రహం నిర్మించారు చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన గుర్రపు విగ్రహము. |
| --> దీనిని చూడ్డానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇది మంగోలియాలోని ఉలాన్ బాటర్ ప్రాంతంలో ఉంది . |
| --> ప్రపంచంలోనే అతి ఎత్తయిన 'ఈక్వెస్త్ట్రెన్ స్టాట్యూ ' ఇదే. అంటే రౌతుతోఉన్న గుర్రమని అర్థం, ఇది మామూలు విగ్రహాల్లా కాకుండా ఒక భవంతిపై నిర్మించారు. ఈ విగ్రహం ఎంత ఎత్తు 40 మీటర్లు. అంటే 130 అడుగులకు పైనే. దాదాపు పదంతస్తుల భవనంతో సమానం అనుకోవచ్చు. |
| --> పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసిన ఈ భారీ విగ్రహం నిర్మాణానికి 250 టన్నుల స్టీలు ఉపయోగించారు. అందుకే పగలు కన్నా రాత్రి విద్యుత్ దీపాలతో మరింత మెరిసిపోతూ కనిపిస్తుంది. |
| నిర్మాణానికి
రెండేళ్లు పట్టింది. 2006లో పనులు మొదలైతే 2008లో పూర్తయ్యాయి. |
| మంగోలియా పూర్తి పేరు : మోంగోల్స్ |
| మంగోలియా జాతీయగీతం : "బూగ్ద్ నాయిరామ్‌దాక్ మొంగోల్" ( సమైక్య మంగోలియా) |
| మంగోలియా రాజధాని : ఉలాన్‌బతార్ |
| మంగోలియా అధికార భాషలు : మంగోలియన్ |
| మంగోలియా ప్రభుత్వం : పార్లమెంటరీ
ప్రజాతంత్రం |
| మంగోలియా రాష్ట్రపతి :
నాంబరిన్ ఎన్‌క్‌బయార్ |
| మంగోలియా ప్రధానమంత్రి : మియీగోమ్ బిన్ ఎంక్‌బోల్డ్ |
| మంగోలియా జాతీయ స్థాపక దినం : స్వాతంత్ర్యము డిసెంబరు 29 1911 |
| మంగోలియా విస్తీర్ణం : 1,564,116 కి.మీ² |
| మంగోలియా జనాభా : 2,794,100 |
| మంగోలియా జీడీపీ : $5.56 బిలియన్ |
| మంగోలియా కరెన్సీ : తాగ్‌రాగ్ (MNT) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment