ఓ స్త్రీ రేపు రా....(O Sthree Repu Raa....) నిజమెంత ? మీకు తెలుసా ?






o sthree repu raa కోసం చిత్ర ఫలితం


-- >  ఓ స్త్రీ రేపు రా.... కొన్నేళ్ల క్రితం ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రతి ఇంటి డోర్- మీద అలా రాసిన రాతలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఎవరో ఒకావిడ అడుక్కోవడానికి వస్తుందని... ఆమెకు పొరపాటున బిక్షమేస్తే వెంటనే చనిపోతారనే పుకారు... ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసింది. తను వచ్చినపుడు ఓ స్త్రీ రేపు రా అని రాసి ఉంటే ఆ స్త్రీ వెళ్లిపోతుందని నమ్మారు. 
-- >  అప్పడే పుట్టిన బాబు... మాట్లాడాడని ఈ రాత్రి ఎవరు నిద్రపోతే వారు చనిపోతారని చెప్పాడని కొందరు వ్యక్తులు పుకారు సృష్టించారు .పుకార్లు ఓ రేంజ్-లో వ్యాపించాయి. అంతే... జనాలందరూ ఇలా జాగారం చేశారు. 

-- >  ఒక్కడే కొడుకు ఉన్నవారు కొబ్బరి కాయ కొట్టాలని... లేదంటే ఆ కుమారుడు చనిపోతాడని కొందరు అన్నారు. అందరూ నమ్మారు. అంతే కొబ్బరి కాయలకు డిమాండ్- పెరిగిపోయింది . 
o sthree repu raa కోసం చిత్ర ఫలితం
-- >  అలాగే ఇంటి ముందు దీపం పెట్టాలని లేదంటే పిల్లలు చనిపోతారని మరొకసారి పుకారు వచ్చింది. పోతే పోయిందిలే. దీని వల్ల కీడు జరగకపోయినా పాటిస్తే అనుమానం పోతుంది కదా అనేవాళ్లు కూడా కూడా చాలా మంది ఉండడంతో ఈ పుకారు కుడా చాలా పాపులర్ అయింది .
-- >  కొన్నేళ్ల క్రితం రంగురంగుల గాజులు వేసుకోవాలని లేదంటే భర్త చనిపోతాడనే వార్తతో ప్రతి ఇల్లాలి చేతికి కలర్- గాజులకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . 
-- >  ఇంకోసారి దెయ్యం బురఖా వేసుకుని బస్సులో ప్రయాణిస్తుందని.. బురఖా తీయగానే ముఖమంతా కళ్లే కనిపిస్తాయని అనడంతో బస్సు ప్రయాణం చేయాలంటే హడలి పోయి  వాటికి కొద్ది రోజులు దూరంగానే ఉన్నారు.
-- >  తాజాగా తెలంగాణాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, కృష్టా జిల్లాల్లో రాత్రులు నిదురపోతే చనిపోతారనే వార్తతో ఈ రాత్రి నిద్రపోతే చనిపోతారని ఎవరో చెప్పిన మాట విని చాలామంది ప్రజలు రాత్రి నిద్రపోకుండా గడిపేశారు. 
-- >  కొందరు ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. పైగా... ఏం జరుగుతుందో ఏంటో అని అందరిలో ఒకటే భయం. పడుకుంటే నిజంగానే చనిపోతామని టెన్షన్- ఎవరినీ నిద్రపోనివ్వలేదు. 
 -- >  ఎక్కడో... ఎవరో... ఏదో అంటారు... ఇంకేదో చెప్తారు. దాన్ని నిజమే అని నమ్మేస్తున్నారు జనం.  మూఢవిశ్వాసాల జాడ్యం పోవడంలేదు
-- >  ఓ వైపు దెయ్యాలు , భూతాలు, మంత్రతంత్రాలు లేవని సైన్స్ -రుజువు చేస్తూనే ఉంది.  చావుకి మనిషి ఎంత భయపడతాడో అనేది అందరికీ తెలిసిన విషయమే.
-- >  నిదానంగా ఆలోచించి దీనిలో నిజమెంత అని ఆలోచించిక పొతే " సృష్టిలో మానవుని మించిన తెలివిగల జీవి మరొకటి లేదు"  అనే మాట తప్పు అని ఒప్పుకోవాలి. తప్పదు. 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment