ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అని ఎందుకు అంటారు ?



.
ఇందుకు ఒక వివరణ:

ఏప్రిల్ ఫూల్ కోసం చిత్ర ఫలితం


పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి.

ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది.
april fool కోసం చిత్ర ఫలితం

అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేశా
డు. 

ఆ రోజులలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్
 , వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్ లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) 

కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని త్వరగా మార్చుకోలేకపోయారు.

కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు.

అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. అందుకని ఇప్పటికీ కొంటె గా  బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలాయి. 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment